ఉగ్రవాదమే తొలి శత్రువు : రాజ్‌నాథ్

| Edited By:

Aug 03, 2019 | 6:40 PM

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించారు. భారత్ డైనమిక్ లిమిటెడ్.. స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అశాంతిని కలిగించే ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించేది లేదన్నారు. పాకిస్థాన్.. ఘోరీ, బాబర్ లాంటి క్షిపణులను తయారుచేస్తోందని.. ఆ పేర్లను చూస్తే.. పాక్ తీరు అర్ధమవుతుందోన్నారు. ఆ పేర్లు విధ్వంసాలకు కేరాఫ్ అని వ్యాఖ్యానించారు. కానీ భారత్ మాత్రం.. పృధ్వీ, అగ్ని, ఆకాష్ అంటూ పంచభూతాల పేర్లు […]

ఉగ్రవాదమే తొలి శత్రువు : రాజ్‌నాథ్
Follow us on

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హైదరాబాద్‌లో పర్యటించారు. భారత్ డైనమిక్ లిమిటెడ్.. స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అశాంతిని కలిగించే ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించేది లేదన్నారు. పాకిస్థాన్.. ఘోరీ, బాబర్ లాంటి క్షిపణులను తయారుచేస్తోందని.. ఆ పేర్లను చూస్తే.. పాక్ తీరు అర్ధమవుతుందోన్నారు. ఆ పేర్లు విధ్వంసాలకు కేరాఫ్ అని వ్యాఖ్యానించారు. కానీ భారత్ మాత్రం.. పృధ్వీ, అగ్ని, ఆకాష్ అంటూ పంచభూతాల పేర్లు పెట్టడం.. మనలో ఉన్న శాంతికి చిహ్నంమన్నారు. ఒకప్పుడు భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునేదని… కానీ ఇప్పుడు ఎగుమతి చేసే స్థితికి వచ్చామన్నారు రాజ్‌నాథ్.