ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌పై కేంద్రమంత్రి ఫైర్

| Edited By:

Dec 27, 2019 | 4:14 PM

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌పై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే మండిపడ్డారు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయులంతా హిందువులే అని వ్యాఖ్యానించారు. భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాందాస్ అథవాలే తప్పుపట్టారు. భారతీయులంతా హిందువులనడం సరైంది కాదన్నారు. డిసెంబర్ 25న నగరంలోని సరూర్‌నగర్‌ స్టేడియంలో ఆరెస్సెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు.. భగవత్ హాజరయ్యారు. ఈ క్రమంలో సభలో ప్రసంగించిన ఆయన.. భారత్‌లో పుట్టిన వారంతా […]

ఆర్ఎస్ఎస్‌ చీఫ్‌పై కేంద్రమంత్రి ఫైర్
Follow us on

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌పై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే మండిపడ్డారు. గత రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భారతీయులంతా హిందువులే అని వ్యాఖ్యానించారు. భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాందాస్ అథవాలే తప్పుపట్టారు. భారతీయులంతా హిందువులనడం సరైంది కాదన్నారు. డిసెంబర్ 25న నగరంలోని సరూర్‌నగర్‌ స్టేడియంలో ఆరెస్సెస్‌ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు.. భగవత్ హాజరయ్యారు. ఈ క్రమంలో సభలో ప్రసంగించిన ఆయన.. భారత్‌లో పుట్టిన వారంతా హిందువులేనని, మతాచారాలు, సంప్రదాయలు వేరైనా మనమంతా భరతమాత బిడ్డలమేనంటూ వ్యాఖ్యానించారు. తమ సంస్థ (ఆర్ఎస్‌ఎస్‌) దృష్టిలో దేశంలోని 130 కోట్ల మంది భారతీయులు.. హిందువులేనని భగవత్ అన్నారు.

భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలను.. కేంద్ర సామాజిక న్యాయ శాఖా మంత్రి రాందాస్ అథవాలే తప్పుబట్టారు. ‘భారతీయులందరూ హిందువని చెప్పే హక్కు ఎవరికీ లేదని.. ఒకప్పుడు దేశంలో బుద్ధులు మాత్రమే ఉన్నారన్నారు. దేశంలో ఉన్నవారందరూ భారతీయులేని భగవత్ వ్యాఖ్యానించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. దేశంలో బుద్ధులు, సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, లింగాయత్‌లు ఉన్నారన్నారు. ఇలా వివిధ మత విశ్వాసాలకు సంబంధించిన వారంతా ఇక్కడే నివసిస్తున్నారన్నారు.

కాగా, రాందాస్ అథవాలే.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) పార్టీకి అధ్యక్షులుగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు భగవత్ చేసిన వ్యాఖ్యలను వివక్ష పార్టీలు కూడా ఖండించాయి. ముఖ్యంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఒకే మతం ఉండేలా ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని… కానీ అది సాధ్యంకాదని పేర్కొన్నారు.