Viral: అతను ప్లాంట్‌లో పని చేసే సాధారణ కూలీ.. కానీ ఇంట్లో చెక్ చేయగా పోలీసులు మైండ్ బ్లాంక్

| Edited By: Ravi Kiran

Aug 06, 2022 | 3:09 PM

అతడు ఉత్తరాది నుంచి ఎలాగోలా బ్రతికేయడానికి వచ్చాడనుకుంటే పొరపాటే. ఇక్కడికి వచ్చి.. పెద్ద దందాకే తెరలేపాడు. మరిన్ని వివరాలు....

Viral: అతను ప్లాంట్‌లో పని చేసే సాధారణ కూలీ.. కానీ ఇంట్లో చెక్ చేయగా పోలీసులు మైండ్ బ్లాంక్
representative image
Follow us on

Crime News: అతను పొట్ట కూటి కోసం నార్త్ నుంచి సౌత్ వచ్చాడు. ఓ ప్లాంట్‌లో నెలవారీ జీతం తీసుకుంటూ కూలి పని చేస్తున్నాడు. కానీ ఈ పని కేవలం కవరప్ కోసమే. అతని అసలు దందా వేరే ఉంది. చిన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టగా స్టన్ అయ్యే విషయాలు వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు(Tamil Nadu) కోయంబత్తూరు(Coimbatore)లోని అన్నూర్(Annur) సమీపంలోని గణేశపురం ప్రాంతంలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన యువకులు గంజాయి విక్రయిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో అన్నూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నిత్య నేతృత్వంలో పోలీసులు గణేశపురం ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని పేరు రవీందర పరిదా అని, అతను ఒడిశా రాష్ట్రానికి చెందినవాడని, అదే ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ప్లాంట్‌లో గత ఏడేళ్లుగా పని చేస్తున్నాడని తెలిసింది. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. అతడు గంజాయిని మరో ప్రాంతం నుంచి కొనుక్కుని రావడం లేదు. తన ఇంట్లోని ఖాళీ స్థలంలో గంజాయి విత్తనాలు నాటుతూ మొక్కలను పెంచుతున్నాడు. దీంతో పోలీసులు అతడి నివాసానికి తీసుకెళ్లి సోదాలు చేయగా అక్కడ మూడు నెలల వయసున్న గంజాయి మొక్కలను గుర్తించారు.

మొక్కలను ధ్వంసం చేసిన పోలీసులు.. నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనకొచ్చే డబ్బు సరిపోక… ఈజీ మనీ కోసం ఈ దారి ఎంచుకున్నట్లు నిందితుడు ప్రాథమిక విచారణలో తెలిపాడు.

Ganja

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి