తమిళనాడు మంత్రి రాజకన్నప్పన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరుతూ విపక్షాల ఫైర్

తమిళనాడు మంత్రి రాజకన్నప్పన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఫైర్ అయ్యింది. డీఎంకే విభజన రాజకీయాలు చేయడంతో పాటు జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మండిపడింది. తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో ఈ వ్యాఖ్యలపై మరింత చర్చ జరుగుతోంది. మంత్రి వ్యాఖ్యలు ప్రమాదకరమని.. బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.

తమిళనాడు మంత్రి రాజకన్నప్పన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు కోరుతూ విపక్షాల ఫైర్
Minister Raja Kannappan

Updated on: Feb 12, 2026 | 7:05 AM

తమిళనాడు మంత్రి ఆర్.ఎస్. రాజకన్నప్పన్ చేసిన ఉత్తర-దక్షిణ భారతదేశ విభజన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తమిళనాడులో త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో ఈ వ్యాఖ్యలపై మరింత చర్చ జరుగుతోంది. మంత్రి వ్యాఖ్యలు ప్రమాదకరమని.. బాధ్యతారాహిత్యమని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ మండిపడ్డారు. దీనిపై బీజేపీ సహా విపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల వేళ డీఎంకే ప్రాంతీయ విభజనలను రేకెత్తిస్తోందని ఆరోపించాయి.

తమిళనాడులోని పుదుక్కోట్టైలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన రాజకన్నప్పన్.. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఎప్పుడు విడిపోతాయో ఎవరికి తెలుసు? అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ సహా విపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల వేళ డీఎంకే ప్రాంతీయ విభజనలను రేకెత్తిస్తోందని ఆరోపించాయి. రాజకన్నప్పన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. DMK నాయకులు పదేపదే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలను విమర్శిస్తూ, వారిని వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని నాగేంద్రన్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు జాతీయ విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉందని విమర్శించారు. జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న వారిని తమిళనాడు ప్రజలు తిరస్కరిస్తారన్నారు.

జాతీయ ఐక్యతను పణంగా పెట్టి ప్రాంతీయ గుర్తింపు రాజకీయాలను ఉపయోగించుకునే పార్టీగా DMK మారిందని బీజేపీ ఆరోపించింది. ఈ అంశంపై డీఎంకేను టార్గెట్ చేసేలా బీజేపీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే కూటమిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న బీజేపీ.. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లనుందనే చర్చ జరుగుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..