మొహరం ఊరేగింపులకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకర

|

Aug 27, 2020 | 6:12 PM

మొహరం ఊరేగింపులకు సుప్రీంకోర్టు నో చెప్పింది.. ఊరేగింపులను అనుమతించబోమని స్పష్టం చేసింది.. అయితే అలహాబాద్‌ హైకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చని పిటిషనర్‌కు సుప్రీం సూచించింది..

మొహరం ఊరేగింపులకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకర
Follow us on

మొహరం ఊరేగింపులకు సుప్రీంకోర్టు నో చెప్పింది.. ఊరేగింపులను అనుమతించబోమని స్పష్టం చేసింది.. అయితే అలహాబాద్‌ హైకోర్టులో అప్పీల్‌ చేసుకోవచ్చని పిటిషనర్‌కు సుప్రీం సూచించింది.. ఊరేగింపులకు అనుమతిస్తూ దేశమంతటకీ సాధారణ ఉత్తర్వులను తాము ఎలా ఇవ్వగలమని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో ఇలాంటి ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేమని చెప్పింది.. అంతే కాకుండా కరోనా వైరస్‌ వ్యాప్తికి ఓ వర్గాన్ని టార్గెట్‌ చేసే అవకాశం లేకపోలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బొపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే తాము ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. పూరి జగన్నాథ్‌ రథయాత్రతో మొహరం ఊరేగింపులను పోల్చలేమని, పూరీ రథయాత్ర కేవలం ఓ ప్రాంతానికి సంబంధించిన వేడుక అని, మొహరం అలా కాదని సుప్రీం తెలిపింది. అన్ని అంశాలను అంచనా వేసిన తర్వాతే పూరి రథయాత్రకు షరతులతో కూడిన అనుమతులిచ్చామని సుప్రీంకోర్టు వివరించింది. మొహరం ప్రదర్శనలకు అనుమతించాలని షియా నేత సయ్యద్‌ కల్బే జవాద్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్‌ను అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచన చేసింది.