విభజన సమస్యలు, వివాదాలు, అంశాలు చర్చించేందుకు కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఒకట్రెండు అంశాలపై కొంత స్పష్టత వచ్చినా విభజన వివాదాలపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. అటు బయ్యారం స్టీల్ ప్లాంట్ ముగిసిన అధ్యాయం అన్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గులాబీ దళం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి ఇక రెండేళ్లే సమయం ఉండటంతో రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న అంశాలు పరిష్కరించేందుకు కేంద్ర హోం సమావేశం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సహ రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
కంపెనీలు, కార్పొరేషన్ల విభజన సహ రెండు రాష్ట్రాలకు చెందిన ఏడు కీలక అంశాలతో ఈ సమావేశపు అజెండా సిద్ధం చేశారు. వీటితో పాటు ఏపీకి సంబంధించి అనదంగా మరో ఏడు అంశాలు అజెండాలో ఉంచారు. విద్యుత్ బకాయిల వివాదాన్ని ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించినా.. అజెండాలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. అటు ఏపీ కొత్త రాజధానికి నిధులు వ్యవహారంపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే రాజధానిలో ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలన్నీ ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగానే పరిష్కరించాలని సమావేశంలో తెలంగాణ డిమాండ్ చేసింది. అయినా కీలక అంశాల్లో ఎలాంటి పరిష్కారం లేకుండానే సమావేశం ముగిసింది.
కార్పొరేషన్ బోర్డు పునర్‌వ్యవస్థీకరణకు కేంద్రం చేసిన అభ్యర్థనపై కేంద్రం చర్యలు తీసుకోలేదని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజనకు సంబంధించి బలమైన వాదనలు వినిపించింది. 238 ఎకరాల భూమిని పునఃప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా, ఏపీఎస్ఎఫ్సీ అప్పటి బోర్డు ఏకపక్షంగా విభజన ప్రణాళికను సిద్ధం చేసినందున రాష్ట్రం బోర్డును పునర్నిర్మించాలని కోరింది.
కేంద్రప్రభుత్వం భూసమస్యను పక్కనపెట్టి మిగిలిన సమస్యలను పరిష్కరించాలని ఏపీ ప్రజాప్రతినిధులు వాదించారు. అయితే ప్రధాన కార్యాలయం నిర్వచనానికి సంబంధించిన అంశం, వివాదాల్లో ఉన్న భూములను ప్రధాన కార్యాలయ ఆస్తిలో భాగంగా పరిగణిస్తారా లేదా అనే అంశంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.
రెండు రాష్ట్రాల మధ్య నగదు నిల్వలను జనాభా నిష్పత్తి ఆధారంగా, ఆస్తులను లొకేషన్ ప్రాతిపదికన విభజించాలని షెడ్యూల్ X సంస్థల విభజనకు సంబంధించి హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వును ప్రధాన కార్యదర్శి గుర్తు చేశారు. షెడ్యూల్ X సంస్థలను కూడా లొకేషన్ ప్రాతిపదికన కాకుండా జనాభా నిష్పత్తిలో విభజించాలన్న ఏపీ ప్రభుత్వ వాదనపై ప్రధాన కార్యదర్శి స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్రం స్పీకింగ్ ఆర్డర్‌తో పూర్తిగా ఏకీభవించింది. కేంద్ర మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉన్నాయని, అందువల్ల ఈ అంశంపై తదుపరి సమీక్ష అవసరం లేదని తెలంగాణ అభిప్రాయపడింది.
రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం సభ జరుగుతుండగానే.. తెలంగాణలో బయ్యారం చిచ్చు రాజుకుంది. స్టీల్ పరిశ్రమ ఫీజుబులిటీ కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ప్రజలకు కిషన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు. మరోసారి తెలంగాణ ప్రజలను, గిరిజన యువతను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు మంత్రులు, ఎమ్మెల్యేలు. బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అంటూ నినదిస్తున్నారు.
అటు రాష్ట్రాల మధ్య విభజన చిక్కులకు పరిష్కారం లభించడం లేదు.. ఇటు రాష్ట్రాలకు చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ తెలుగు రాష్ట్రాల అంటున్నాయి.
ఎస్‌సిసిఎల్ విభజనపై మరోసారి ఎపి ప్రభుత్వంతో చర్చలు జరిగాయి, ఎస్‌సిసిఎల్‌కు వారసత్వ రాష్ట్రంలో ఆస్తులు ఉన్నాయని, అయితే 51ని బదిలీ చేస్తూ పునర్వ్యవస్థీకరణ చట్టంలో నిర్దిష్ట నిబంధన ఉన్నందున ఆ ప్రశ్న ఉత్పన్నం కాదనే వాదనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా ఈక్విటీ శాతం. ఎస్సీసీఎల్ అనుబంధ సంస్థ అయిన ఏపీ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్‌లో అప్పటి ఏపీ ప్రభుత్వం ఈక్విటీని మాత్రమే విభజించాల్సి ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఈ సమావేశంలో మొత్తం 11 అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు అర్థమవుతోంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదలలో జాప్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన హోం శాఖ కార్యదర్శి నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రిత్వశాఖను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం