Good News: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆ డేట్ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలకు నో ఫైన్.. ఎక్కడంటే..

సాధారణంగా దీపావళి కానుకలు అంటే.. ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తారు. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం కొంచెం భిన్నంగా వాహనదారులకు గుడ్‌న్యూస్ అందించింది.

Good News: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఆ డేట్ వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలకు నో ఫైన్.. ఎక్కడంటే..
No Fine For Traffic Violati

Updated on: Oct 22, 2022 | 1:35 PM

సాధారణంగా దీపావళి కానుకలు అంటే.. ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తారు లేదా స్వీట్ బాక్స్‌లు పంచిపెడతారు. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం కొంచెం భిన్నంగా వాహనదారులకు గుడ్‌న్యూస్ అందించింది. పండుగ సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలకు వారం రోజుల పాటు ఎలాంటి ఫైన్స్ విధంచబోమని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అక్టోబర్ 21-27 వరకు ఇది అమలవుతుందని ఆయన పేర్కొన్నారు.

‘దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 27వ తేదీ వరకు ట్రాఫిక్ ఫైన్స్ విధించకూడదని నిర్ణయించాం. ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అలా అని ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే.. ట్రాఫిక్ పోలీసులు చూస్తూ ఊరుకోరు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి గుజరాత్ పోలీసులు పూలు ఇచ్చి శిక్షిస్తారని’ హర్ష్ సంఘవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, ట్రాఫిక్ నిబంధనలకు నో జరిమానా అని తీసుకున్న ఈ నిర్ణయానికి నెటిజన్ల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.