Nirmala sitharaman record: 2020-21 కేంద్ర బడ్జెట్‌కి గానూ సుదీర్ఘంగా ప్రసంగించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2019-20 సంవత్సరానికి గాను 02 గంటల 17 నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించారు. మొత్తం 2 గంటల 43 నిమిషాల పాటు నిర్విరామంగా ఆమె తన ప్రసంగ పాఠాన్ని కొనసాగించారు. అంటే దాదాపు 26 నిమిషాలు అదనంగా ఈ ఏడాది ఆమె ప్రసంగించారు. కాగా.. రెండోసారి పార్లమెంటులో బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టారు. మధ్యలో కశ్మీరీకి సంబంధించిన ఓ కవితను చదివి సభను ఆకట్టుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు సైతం ఆమె సుధీర్ఘ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించడం విశేషం. ఈ బడ్జెట్ సామాన్య ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటుందని, ఈజ్ ఆఫ్ లివింగ్ పదాన్ని పదేపదే ప్రస్థావించిన నిర్మలా.. మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలను గుర్తు చేశారు.