దేశరాజధాని ఢిల్లీలోని 2012లో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ యువతిపై బస్సులో సాముహిక అత్యాచారం చేయడం ఆ తర్వాత ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందడంతో దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక చోట్ల నిందుతులను ఉరి తీయాలంటూ రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. సత్నా జిల్లాలోని ప్రముఖ ఆలయ ట్రస్టులో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు 12 ఏళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డారు. ఆమెను మభ్యపెట్టి గురువారం రోజున ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను అత్యాచారం చేసి తమ రాక్షసత్వా్న్ని చూపించారు. ఆ బాలిక శరీరమంతా గాయాలు చేశారు. కర్రను, అలాంటి మరో వస్తువును ఆమె ప్రైవేటు భాగాల్లో చొప్పించి ఉన్మాదాన్ని చూపారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రోజున నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే కోర్టు వారిద్దరికీ 14 రోజుల పాటు జ్యూడీషియల్ విచారణకు తరలించింది. తీవ్ర గాయాలపాలై రక్తస్రావంతో అచేతనంగా పడి ఉన్న బాలికను రేవాలోని ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక శరీరంపై పులచోట్ల పంటిగాట్లు, గాయాలు ఉన్నాయని సాత్నా జిల్లా ఎస్పీ అశుతోష్ తెలిపారు. తమ ఉద్యోగులు తీరు వల్ల ఆలయ ప్రతిష్ఠకు భంగం వాటిల్లడంతో ట్రస్టు అధికారులు ఆ నిందితులిద్దరని విధుల నుంచి తొలగించారు. మధ్యప్రదేశ్‌లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ బాలికకను మెరుగైన వైద్య సాయం అందించాలని.. అలాగే కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ దారుణమైన అఘాయిత్యం నిర్భయ సంఘటనను గుర్తుచేస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.