నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీయవచ్చు.. ఢిల్లీ హైకోర్టులో కేంద్రం వాదన

నిర్భయ కేసులో నలుగురు దోషులను వేర్వేరుగా ఉరి తీయవచ్చునని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వీరి ఉరితీతపై పటియాలా హౌస్ కోర్టు స్టే జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. కేంద్రం ఢిల్లీ హైకోర్టుకెక్కింది. సెంటర్ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. తమ ఉరిని తప్పించుకునేందుకు దోషులు కావాలనే జాప్యం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్యురేటివ్ లేదా మెర్సీ పిటిషన్ వేయలేదంటే అది ముందుగానే వేసుకున్న ప్లాన్ లో […]

నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీయవచ్చు.. ఢిల్లీ హైకోర్టులో కేంద్రం వాదన
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 02, 2020 | 4:54 PM

నిర్భయ కేసులో నలుగురు దోషులను వేర్వేరుగా ఉరి తీయవచ్చునని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. వీరి ఉరితీతపై పటియాలా హౌస్ కోర్టు స్టే జారీ చేయడాన్ని సవాలు చేస్తూ.. కేంద్రం ఢిల్లీ హైకోర్టుకెక్కింది. సెంటర్ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. తమ ఉరిని తప్పించుకునేందుకు దోషులు కావాలనే జాప్యం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా క్యురేటివ్ లేదా మెర్సీ పిటిషన్ వేయలేదంటే అది ముందుగానే వేసుకున్న ప్లాన్ లో భాగమని అన్నారు. మెర్సీ పిటిషన్ కూడా ‘పెండింగ్ అప్పీలు’పరిధిలోనే ఉంటుందని భావించి ట్రయల్ కోర్టు తప్పు చేసిందని, ఇది సహనిందితులను కాపాడే విధంగా ఉందని తుషార్ మెహతా పేర్కొన్నారు. వేర్వేరు వాస్తవాల ఆధారంగా దోషుల మెర్సీ పిటిషన్లపై రాష్ట్రపతి వేర్వేరుగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన చెప్పారు. రివ్యూ పిటిషన్ కు సంబంధించిన నిబంధనలను ముకేశ్ సింగ్ దుర్వినియోగం చేశాడని, ఇతర దోషుల బ్యాండ్ వేగన్ తో చేతులు కలిపాడని ఆయన అన్నారు. పవన్ గుప్తా 2017 లో 225 రోజుల అనంతరం రివ్యూ పిటిషన్ వేశాడని పేర్కొన్నారు. అతగాడు మెర్సీ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు గనుక.. ఇతర దోషులను కూడా శిక్షించజాలమని ట్రయల్ కోర్టు అభిప్రాయపడినట్టు కనిపిస్తోందన్నారు.

కాగా-వేర్వేరు తేదీలలో నాలుగు మెర్సీ పిటిషన్లు దాఖలై.. ఇద్దరి పిటిషన్లను కోర్టు కొట్టివేసి.. మరో ఇద్దరి పిటిషన్లను పెండింగులో ఉంచితే ఏమవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించగా .. అలాంటప్పుడు మొదట ఇద్దరిని, ఆ తరువాత మరో ఇద్దరినీ ఉరి తీయవచ్చునని తుషార్ మెహతా అన్నారు. అటు-కేంద్రం వాదనపై మీ వైఖరి తెలియజేయాలని తీహార్ జైలు అధికారులను, జైళ్ల శాఖ డీజీని కోర్టు ఆదేశించింది.

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా