AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీరవ్ మోడీ కస్టడీ నవంబరు 3 వరకు పొడిగింపు

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కస్టడీని లండన్ కోర్టు పొడిగించింది. వచ్ఛే నెల 3 న ఆయనను మళ్ళీ వీడియో లింక్ ద్వారా కోర్టు విచారించనుంది. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకును..

నీరవ్ మోడీ కస్టడీ నవంబరు 3 వరకు పొడిగింపు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 09, 2020 | 7:59 PM

Share

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కస్టడీని లండన్ కోర్టు పొడిగించింది. వచ్ఛే నెల 3 న ఆయనను మళ్ళీ వీడియో లింక్ ద్వారా కోర్టు విచారించనుంది. ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కేసుకు సంబంధించి అరెస్టయిన నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనను అప్పగించాలని భారత ప్రభుత్వం బ్రిటన్ ను కోరుతోంది. కాగా ఈ కేసు విషయంలో భారత అధికారులు సమర్పించిన సాక్ష్యాధారాలను విచారణకు స్వీకరించాలా. లేదా అన్నదానిపై వాదనలను కోర్టు నవంబరు 3 న ఆలకించనుంది. నీరవ్ మోడీ కేసులో తుది హియరింగ్ వచ్ఛే డిసెంబరులోగానీ, కొత్త సంవత్సరారంభంలో గానీ జరగవచ్చు.

Follow Us