Nipah Virus Kerala: నిపా వైరస్ ఎఫెక్ట్.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..

|

Sep 17, 2023 | 8:25 AM

నిపా వైరస్ వ్యాప్తి కారణంగా కేరళలోని కోజికోడ్‌లో అన్ని విద్యాసంస్థలను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 18 నుండి ట్యూషన్ సెంటర్లు, మదర్సాలు, అంగన్‌వాడీలు, కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలు తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయబడతాయని కోజికోడ్ జిల్లా కలెక్టర్ శనివారం తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఆన్‌లైన్ తరగతులకు అనుమతించారు.

Nipah Virus Kerala: నిపా వైరస్ ఎఫెక్ట్.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..
School Closed
Follow us on

Nipah Virus Kerala: నిపా వైరస్ వ్యాప్తి కారణంగా కేరళలోని కోజికోడ్‌లో అన్ని విద్యాసంస్థలను నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 18 నుండి ట్యూషన్ సెంటర్లు, మదర్సాలు, అంగన్‌వాడీలు, కోచింగ్ సెంటర్‌లతో సహా అన్ని విద్యాసంస్థలు తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయబడతాయని కోజికోడ్ జిల్లా కలెక్టర్ శనివారం తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఆన్‌లైన్ తరగతులకు అనుమతించారు.

ఇక పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు ఉండవని స్పష్టం చేశారు అధికారులు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పరీక్ష సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటించాలన్నారు. పరిపాలన విపత్తు నిర్వహణ చట్టంలోని 26, 30, 34 సెక్షన్లను కూడా విధించింది. విద్యాసంస్థలను సెప్టెంబర్ 24 వరకు మూసివేయాలని ఆదేశించడం జరిగింది. నిపా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులకు బదులుగా.. విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను ఏర్పాటు చేయవచ్చని అధికారులు తెలిపారు.

కేరళ ఆరోగ్య మంత్రి వీణా మాట్లాడుతూ.. నిపా వైరస్ వ్యాప్తికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిపా వైరస్ బారిన పడిన 21 మంది హై రిస్క్ రోగులు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వీరిలో కొందరు కోజికోడ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. నిపాతో మరణించిన మొదటి వ్యక్తి కుమారుడైన తొమ్మిదేళ్ల బాలుడికి కూడా నిపా వైరస్ పాజిటివ్ వచ్చింది. అయితే, అతని ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని చెబుతున్నారు.

కాగా, తాజాగా వ్యాప్తి చెందుతున్న నిపా వైరస్ కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని మాజీ ఐసిఎంఆర్ డారామన్ గంగాఖేడ్కర్ తెలిపారు. నిపా వ్యాప్తి విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. కాగా, ప్రస్తుత నిపా వైరస్ బంగ్లాదేశ్ జాతికి చెందినదిగా పేర్కొంటున్నారు. మలేషియా నిపా వైరస్‌తో నాడీ సంబంధిత సమస్యలు వచ్చేవని, కానీ, బంగ్లాదేశ్ జాతి నిపా వైరస్‌లో అధిక మరణాల రేటు నమోదవుతుందన్నారు. ఇది 10 మందిలో 9 మంది మరణాలకు కారణం అవుతుందని చెప్పారు అధికారులు. మొదటి వ్యాప్తి సమయంలో 23 కేసులలో 89% మంది రోగులు మరణించారని డాక్టర్ గంగాఖేడ్కర్ తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా నిపా వైరస్ 1999లో మలేషియాలో వ్యాపించింది. కేరళలో 2018 నిపా వ్యాప్తి చెందింది. ఇది గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు అధికారులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.