బ్రేకింగ్.. ఢిల్లీ.. 900 మందికి కరోనా ‘అంటించిన’ డాక్టర్.. తప్పని 14 రోజులపాటు క్వారంటైన్

| Edited By: Anil kumar poka

Mar 26, 2020 | 11:53 AM

ఢిల్లీలో ఓ డాక్టర్ ద్వారా సుమారు 900 మందికి కరోనా మహమ్మారి సోకింది. పరీక్షల్లో వీరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. వీరందరినీ 14 రోజులపాటు ఐసొలేషన్ కి పంపినట్టు ఢిల్లీ....

బ్రేకింగ్.. ఢిల్లీ.. 900 మందికి కరోనా అంటించిన డాక్టర్.. తప్పని  14 రోజులపాటు క్వారంటైన్
Follow us on

ఢిల్లీలో ఓ డాక్టర్ ద్వారా సుమారు 900 మందికి కరోనా మహమ్మారి సోకింది. పరీక్షల్లో వీరికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. వీరందరినీ 14 రోజులపాటు ఐసొలేషన్ కి పంపినట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి ఎస్.జైన్ వెల్లడించారు. ఈశాన్య ఢిల్లీలో గల ఈ డాక్టర్ క్లినిక్ కి ఈ నెల 12-18 తేదీల మధ్య తమ జబ్బుల చికిత్స కోసం వఛ్చిన వారంతా కరోనా బారిన పడ్డారని ఆయన చెప్పారు. సౌదీలో కరోనా పాజిటివ్ కి గురై ఢిల్లీకి వఛ్చి .. తన రుగ్మత కోసం ఈ డాక్టర్ క్లినిక్ లో ఆయన ఇఛ్చిన మందులు వేసుకున్న ఓ మహిళ  ద్వారా ఆయనకు కూడా ఇది సోకిందన్నారు. అతని భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడంతో వారిని కూడా ఐసోలేషన్ కి తరలించినట్టు ఆయన చెప్పారు. ఢిల్లీలో ముఖ్యంగా మధ్యతరగత్గి, పేద వర్గాల వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార ఆప్ పార్టీ మారుమూల సందుల్లో ఇలాంటి క్లినిక్ లను ఏర్పాటు చేస్తోంది.