రైతుల ఆందోళన, పంజాబీ నటుడితో సహా 40 మందికి జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు, అకాలీదళ్ మండిపాటు

రైతుల ఆందోళనకు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ ) కు మధ్య పరోక్షంగా లింక్ ఏర్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అన్నదాతల నిరసనకు..

రైతుల ఆందోళన, పంజాబీ నటుడితో సహా 40 మందికి జాతీయ దర్యాప్తు సంస్థ సమన్లు, అకాలీదళ్ మండిపాటు

Edited By:

Updated on: Jan 17, 2021 | 11:50 AM

రైతుల ఆందోళనకు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ ) కు మధ్య పరోక్షంగా లింక్ ఏర్పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అన్నదాతల నిరసనకు మద్దతు నిస్తున్న పంజాబీ నటుడు దీప్ సిధుతో సహా దాదాపు 40 మందికి ఎన్ ఐ ఏ సమన్లు జారీ చేసింది. వీరిలో రైతు నాయకుడు బల్దేవ్ సింగ్ సిర్సా కూడా ఉన్నారు. రైతుల ఆందోళనకు సిఖ్స్ ఫర్ జస్టిస్ మద్దతు తెలపడంతో ఈ ఆందోళనలో నిషిధ్ధ ఖలిస్తానీలు కూడా ఉన్నారేమోనని ఎన్ ఐ ఏ భావిస్తోంది. అందువల్లే వీరికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపట్ల శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  జాతీయ దర్యాప్తు సంస్థ వంటి ఏజెన్సీల ద్వారా కేంద్రం తమను భయపెట్ట జూస్తోందని ఆయన ఆరోపించారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతునిస్తోందని,  ఈ కారణంగా అన్నదాతల ఆందోళనలో అజ్ఞాతంగా కొందరు ఖలిస్తానీలు ఉన్నారని అనుకుంటున్నామని ఎన్ ఐ ఏ కి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

అటు పంజాబీ నటుడు దీప్ సిధు..ఇలాంటి నోటీసులకు భయపడబోమని అంటున్నాడు. దర్యాప్తు సంస్థ అడిగే ఏ ప్రశ్నలకైనా సమాధానమిస్తామని ఆయన చెప్పాడు. ఈ నెల 18-21 తేదీల మధ్య ఢిల్లీలోని ఎన్ ఐ ఏ కార్యాలయంలో ఈ నటుడితో బాటు 40 మందిని అధికారులు విచారించనున్నారు.

Also Read:

ఆలయం మనిషికి నైతికశక్తిని ఇచ్చే సాధనం, సమాజ రక్షణకు మార్గం, మానసిక ప్రవర్తనలో మార్పు తెచ్చే నిలయం : చిన్న జీయర్ స్వామి

Bailey Bridge in Kashmir: జమ్మూ శ్రీనగర్ హైవే రాంబన్ వద్ద కూలిన వంతెన, కేవలం 60 గంటల్లోనే నిర్మించిన సైన్యం

తిరుపతిలో రెండో రోజు కూడా ఎదురుచూపులే.. వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాని ఫ్రంట్ లైన్ వారియర్స్..