జమ్మూకశ్మీర్ పుల్వామా దాడి కేసులో చార్జీషీట్ దాఖలు అయ్యింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌తో పాటు 15 మందిపై చార్జిషీట్‌లో చేర్చింది జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ). కాగా పుల్వామా దాడికి మసూద్ అజర్‌తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్‌లే ప్రధాన సూత్రధారులుగా ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పేర్కొంది. పుల్వామా దాడి ఘటనపై మొత్తం 13,500పేజీలతో కూడి చార్జిషీట్‌ని ఎన్‌ఐఏ జమ్మూ కోర్టులో సమర్పించనుంది. ఈ దారుణమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు. పాక్ నుంచి ఎలా అమలు చేశారనే దాని గురించి సంబంధించి పూర్తి వివరాలను అధికారులు ఆ చార్జిషీటులో పేర్కొన్నారు. అలాగే వాట్సాప్ చాటింగ్, ఫొటోలు, ఆర్డీఎక్స్ రవాణాకు సంబంధించిన ఫొటోలు, ఫోన్ కాల్స్ డేటా వంటి కీలక ఆధారాలను ఎన్‌ఐఏ అధికారులు కోర్టుకు నివేదించనున్నారు. 2019 ఫిబ్రవరి 14న లెతిపొరా సమీపంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.
Read More:
తెలంగాణలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది
కోవిడ్ భయంతో కాంగ్రెస్ నేత ఆత్మహత్య
వినూత్న ప్రయోగం.. వాట్సాప్‌లో గణేష్ లడ్డూ వేలం