స్వప్నా బెయిల్‌ పిటిషన్ కొట్టివేత

| Edited By:

Aug 10, 2020 | 1:11 PM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుల్లో ఒకరైన స్వప్నా సురేశ్ బెయిల్ పిటిషన్‌ను కొచ్చిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.

స్వప్నా బెయిల్‌ పిటిషన్ కొట్టివేత
Follow us on

Swapna Suresh Bail Petition cancels: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుల్లో ఒకరైన స్వప్నా సురేశ్ బెయిల్ పిటిషన్‌ను కొచ్చిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. స్వప్నా బంగారం అక్రమ రవాణాకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. దుబాయ్ నుంచి వచ్చిన సామాగ్రిలో చాలా సార్లు బంగారం అక్రమంగా రవాణా జరిగినట్లు ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. ఇది భారతదేశ ఆర్థిక భద్రతకు ముప్పు అని నిందితులకు కూడా తెలుసని కోర్టు వివరించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ పేర్కొన్న అభియోగాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని.. కేసు డైరీ, సాక్ష్యాల ఆధారంగా స్వప్నా సురేశ్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

Read This Story Also: చేపల వేపుడు ఎలా చేయాలంటే.. చిరు వీడియో చూశారా