NIA Raid In Kerala: కేరళలో ఎన్‌ఐఏ మెరుపు దాడులు.. పీఎఫ్‌ఐ టెర్రరిస్ట్ స్థావరాలపై స్పెషల్ ఫోకస్..

కేరళలో ఎన్‌ఐఏ మెరుపు దాడులు నిర్వహిస్తోంది. ఒకేసారి పలు ప్రాంతాల్లో దాడులు చేస్తోంది ఎన్‌ఐఏ. ఏకకాలంలో 56 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పీఎఫ్‌ఐ టెర్రరిస్టు కేసులో NIA బృందం హఠాత్తుగా దాడులు చేస్తోంది.

NIA Raid In Kerala: కేరళలో ఎన్‌ఐఏ మెరుపు దాడులు..  పీఎఫ్‌ఐ టెర్రరిస్ట్ స్థావరాలపై స్పెషల్ ఫోకస్..
National Investigation Agency

Updated on: Dec 29, 2022 | 11:03 AM

కేరళపై మరోసారి ఫోకస్ పెట్టింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). గత 24 గంటలుగా ఎన్‌ఐఏ మెరుపు దాడులు నిర్వహిస్తోంది. ఏకకాలంలో 58 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. దేశంలోని నిషేదిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఏ) నాయకుల స్థావరాలపై దాడులు జరుపుతోంది. కేరళ వ్యాప్తంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. పీఎఫ్‌ఐ నాయకులు వేరే పేరుతో పీఎఫ్‌ఐని తిరిగి నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అందడంతో ఈ దాడులను నిర్వహిస్తోంది. ఆ సంస్థకు చెందిన కొందరు కీలక వ్యక్తుల ఉంటున్న స్థావరాలను టార్గెట్ చేసుకుంది ఎన్ఐఏ. సీనియర్ ఎన్‌ఐఎ అధికారి అందించిన సమాచారం ప్రకారం, ఈ తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన ఎన్‌ఐఏ దాడులు ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళలోని ఎర్నాకులంలో నిషేధిత పీఎఫ్‌ఐ నేతలకు సంబంధించిన 8 ప్రత్యేక కార్యాలయాల వీరు కేంద్రంగా ఈ దాడులు సాగుతున్నాయి. తిరువనంతపురంలో 6 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి.

పీఎఫ్ఏ కేరళలో 2006 సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది 2009 సంవత్సరంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే రాజకీయ ఫ్రంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. కేరళలో స్థాపించబడిన ఛాందసవాద సంస్థ క్రమంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో తన శిబిరాన్ని విస్తరించింది.

లేటెస్టుగా మంగళూరు బ్లాస్ట్‌. అంతకుముందు కోయంబత్తూరులో పేలుడు. మంగళూరు బ్లాస్ట్ మిస్టరీని ఛేదించిన పోలీసులకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యే నిజాలు తెలుస్తున్నాయి. టెర్రర్‌ తీగ లాగితే పీఎఫ్ఏ డొంక కదులుతోంది. అసలేంటి ఈ PFI. దీని పుట్టుపూర్వోత్తరాలేంటి? ఉగ్రవాదంతో దీనికి లింకేంటి? ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిషేధించింది. PFI కు ఫండింగ్‌ ఎలా వస్తోంది. ఏయే ఉగ్రవాద సంస్థలతో దీనికి లింకులున్నాయి? నిషేధం తర్వాత ఆ సంస్థ సభ్యులు ఏం చేస్తున్నారు?

కర్ణాటక ఫోరం ఫర్‌ డిగ్నిటీ, నేషనల్‌ డెపలప్‌మెంట్‌ ఫ్రంట్‌ సంస్థల కలయితో 2006లో PFI పురుడు పోసుకుంది. మైనారిటీల హక్కుల కోసం పోరాడే సంస్థగా తనను తాను అభివర్ణించుకునేది ఈ సంస్థ. అయితే ఈ సంస్థ తరచు సంఘ విద్రోహ, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో హైదరాబాద్‌తో పాటు దేశంలో పలుచోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడి నిషేధానికి గురైన ఇండియన్‌ ముజాహిదీన్‌ దాని మాతృ సంస్థ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ అని పిలిచే సిమి, ఈ రెండు కాలక్రమంలో రూపాంతరం చెంది, తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు PFI గా మారాయని 2012లో కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

PFI కార్యకర్తల వద్ద మారణాయుధాలు, బాంబులు, గన్‌ పౌడర్‌, తుపాకులు, కత్తులను పలుమార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థకు తాలిబాన్‌, అల్‌ఖైదా లాంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా మంగళూరు బ్లాస్ట్‌తో మరోసారి PFI పేరు తెర పైకి వచ్చింది. కోయంబత్తూరు, మంగళూరు బ్లాస్టులతో తాజా రివెంజ్‌ దాడుల వెనుక ఈ నిషేధిత సంస్థ హ్యాండ్‌ ఉందని నిర్ధారణ అయింది.

2013 ఏప్రిల్‌లో కేరళలోని కన్నూరులో PFI నిర్వహించిన ట్రైనింగ్‌ క్యాంప్‌పై పోలీసులు దాడులు నిర్వహించి 21మందిని అరెస్ట్‌ చేశారు. వాళ్లను నుంచి బాంబులు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు ప్రముఖుల పేర్లు ఉన్న హిట్‌ లిస్ట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం అప్పట్లో కలకలం రేపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం