Train: రైలులో తనిఖీలు.. ఓ బ్యాగ్‌ తెరిచి చూడగా బిత్తరపోయిన పోలీసులు.. షాకింగ్‌ ఘటన

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే రైల్వే స్టేషన్‌లు, రైళ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు భారీగానే చేపడుతుంటారు పోలీసులు. కొన్ని షాకింగ్‌ ఘటనలు ఎక్కువగా రైళ్లలో, రైల్వే స్టేషన్‌లలోనే జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతుంటారు. ప్రతి రైళ్లలో, స్టేషన్‌లలో తనిఖీలు ముమ్మరం చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో రైళ్లలో, స్టేషన్‌లలో తనిఖీలు నిర్వహిస్తుంటే..

Train: రైలులో తనిఖీలు.. ఓ బ్యాగ్‌ తెరిచి చూడగా బిత్తరపోయిన పోలీసులు.. షాకింగ్‌ ఘటన
Train

Updated on: Mar 04, 2024 | 8:28 PM

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అయితే రైల్వే స్టేషన్‌లు, రైళ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు భారీగానే చేపడుతుంటారు పోలీసులు. కొన్ని షాకింగ్‌ ఘటనలు ఎక్కువగా రైళ్లలో, రైల్వే స్టేషన్‌లలోనే జరుగుతుంటాయి కాబట్టి పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెడుతుంటారు. ప్రతి రైళ్లలో, స్టేషన్‌లలో తనిఖీలు ముమ్మరం చేస్తుంటారు. కొన్ని సందర్భాలలో రైళ్లలో, స్టేషన్‌లలో తనిఖీలు నిర్వహిస్తుంటే పోలీసులే షాక్‌ గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలు తమ ప్రాణాల కంటే తల్లిదండ్రులకు ప్రియమైనవారు. అయితే ఈ కలియుగంలో మాతృత్వాన్నే కాదు మానవత్వాన్ని కూడా కించపరిచే ఇలాంటి ఘటనలు రోజురోజుకూ వెలుగులోకి వస్తున్నాయి.

అలాంటి మరో ఘటన అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. సోమవారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్‌లోని లోక్‌శక్తి ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, వారికి షాక్‌కు గురి చేసే ఘటన ఎదురైంది. రైలులో ఓ నల్ల బ్యాగ్‌ కనిపించగా, దానిని పోలీసులు తనిఖీ చేశారు. ఆ బ్యాంక్‌లో నవజాత శిశువు కనిపించింది. కేవలం రెండుల పసికందును బ్యాగ్‌లో బంధించి సాధారణ బిన్‌లో వదిలేశారు. అయితే బాగ్యులో బయట పడ్డ ఆడ శిశువు సజీవంగా ఉంది. వెంటనే పోలీసులు ఆ శిశువును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సివిల్‌లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పశ్చిమ రైల్వేలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక్‌ శక్తి రైలు ముంబైలోని బ్రాంద్రా స్టేషన్ నుండి బయలుదేరింది. మధ్యలో అనేక స్టేషన్లు ఉన్నాయి. అయితే ఆ ఆడ శిశువుతో ఉన్న బ్యాగ్‌ను రైలులో ఎవ్వరు కూడా కనిపెట్టలేదు. అయితే ఈ ఘటన అహ్మదాబాద్ లేదా సమీపంలోని స్టేషన్‌లో జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అహ్మదాబాద్, ఆనంద్, నడియాడ్ స్టేషన్లలోని సీసీటీవీలను తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఆయా స్టేషన్‌లలో స్టాల్స్‌, ఇతర షాప్‌ల యజమానులను సైతం ప్రశ్నిస్తున్నారు. ఆ శిశువు ఎవ్వరు వదిలి పెట్టారు.. తదితర వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us