పెరగబోతున్న నియోజకవర్గాలు..మారబోతున్న తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.. ఆ ప్రకటనలతో పార్టీలకు కొత్త జోష్!
తెలుగు రాష్ట్రాల పొలిటికల్ మ్యాప్ రీ-లైన్ కాబోతోంది. మీరున్న నియోజకవర్గం రూపురేఖలు రేపు ఉండవు. మీరు చూస్తున్న సరిహద్దులు కూడా ఇకపై కనిపించవు. అయితే.. ఇక్కడే ఒక ప్రశ్న ఎదురైంది. నియోజకవర్గాల పునర్విభజన జనాభా ఆధారంగా కదా జరిగేది.. అలా అయితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కదా అనే ప్రశ్న వినిపించేది. ఇదే ప్రశ్న కేంద్రానికి వినిపించింది కాబోలు.. దానికి సమాధానంగా కొత్త ఫార్ములా తీసుకుంది. జనాభాతో సంబంధం లేకుండా.. అన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడున్న సీట్లకు మరో 50 శాతం సీట్లను పెంచాలనుకుంటోంది. సపోజ్.. 100 అసెంబ్లీ స్థానాలున్న దగ్గర.. ఇకపై 150 అవుతాయి. మరి.. 119 సీట్లు ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఎలా? 60 పెంచుతారా? 59కే పరిమితమా? ఆ ఫార్ములా ఎలా ఉండబోతోంది?

సాధారణంగా.. రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. ఆ ఫార్ములా ప్రకారం.. ‘ఒక్కరు చాలు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దే వద్దు’ అంటూ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం జరుగుతుందనే ఆందోళన ఉంది. ఆ ఆందోళనను తగ్గించడానికి.. అసలు రాష్ట్రాల జనాభాతో సంబంధమే లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లను పెంచుతామంటోంది. ఆల్రడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎన్డీయే మీటింగ్‌లో దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ప్రతి రాష్ట్రానికి 50 శాతం చొప్పున అసెంబ్లీ సీట్లు పెంచితే.. సపోజ్ ఆంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే.. 2029 ఎన్నికలకి అసెంబ్లీ సీట్లు 263కి పెరుగుతాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 175. ఇందులో 50 శాతం అంటే.. దాదాపు 88 స్థానాలు పెరగొచ్చు. అంటే.. 175 ప్లస్ 88. మొత్తం 263 స్థానాలవుతాయి. ఇక లోక్‌సభ స్థానాల సంగతి. ఏపీలో ప్రస్తుతం 25 ఎంపీ సీట్లున్నాయి. 25 సీట్లలో 50 శాతం అంటే.. 13 స్థానాలు పెరగాల్సి ఉంటుంది. 25 ప్లస్ 13.. మొత్తం 38 పార్లమెంట్ నియోజకవర్గాలకు 2029లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక తెలంగాణ సంగతి. తెలంగాణలో ఇప్పుడున్న అసెంబ్లీ సీట్లు 119. 50 శాతం పెంపుతో మరో 60 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అంటే.. మొత్తం 179 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఇప్పుడున్న లోక్‌సభ స్థానాల సంఖ్య...
