ప్రధానమంత్రి కార్యాలయంలో కొత్తగా ఐఏఎస్, నాన్- ఐఏఎస్ అధికారుల నియామకం

| Edited By: Pardhasaradhi Peri

May 30, 2020 | 12:57 PM

ఈ కరోనా కాలంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారుల నియామకాలను చేబట్టారు, ఇలా పునర్వవస్థీకరణ జరగడం ఇది మూడో సారి.

ప్రధానమంత్రి కార్యాలయంలో కొత్తగా ఐఏఎస్, నాన్- ఐఏఎస్ అధికారుల నియామకం
Follow us on

ఈ కరోనా కాలంలో ప్రధాన మంత్రి కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారుల నియామకాలను చేబట్టారు, ఇలా పునర్వవస్థీకరణ జరగడం ఇది మూడో సారి. తమిళనాడుకు చెందిన ఎస్.గోపాలకృష్ణన్, సి. శ్రీధర్, ఇంకా మీరా మొహంతి, అరుణ్ సింఘాల్, రాజేంద్ర కుమార్, సుబీర్ మాలిక్ వివిధ శాఖల్లో నియమితులయ్యారు. ఐ ఏ ఎస్ కాకుండా ఇతర సర్వీసుల్లో ఉన్న సురేంద్ర ప్రసాద్ యాదవ్, మనీష్ తివారీ, హిమబిందు సహా  మొత్తం 11 మందిని జాయింట్ సెక్రటరీలుగా నియమించారు. కరోనా వైరస్ ప్రబలమవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయాన్ని ‘ప్రక్షాళన’ చేయాలన్న హోమ్ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్టు తెలుస్తోంది. నూతన బాధ్యతలు స్వీకరించిన వారంతా తమ తమ రాష్ట్రాల్లో పాలనా సంబంధ విభాగాల్లో అనుభవం ఉన్నవారే.