New Income Tax Bill 2025: కొత్త ఐట్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. అప్పటివరకు ఉభయ సభలు వాయిదా..

|

Feb 13, 2025 | 10:29 PM

విపక్షాల నిరసనల మధ్య వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టంపై జేపీసీ నివేదిను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది కేంద్రం. కొత్త ఐటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తరువాత సెలెక్ట్‌ కమిటీ పంపించారు. ఉభయసభలు మార్చి 10వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. వక్ఫ్‌ బోర్డు ఆస్తులను ముస్లింలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు ఒవైసీ..

New Income Tax Bill 2025: కొత్త ఐట్టీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. అప్పటివరకు ఉభయ సభలు వాయిదా..
New Income Tax Bill 2025
Follow us on

పార్లమెంట్‌ తొలి విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా ముగిశాయి. ఉభయసభలు మార్చి 10వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. విపక్ష ఎంపీల తీవ్ర నిరసనల మధ్య వక్ఫ్‌బోర్డు సవరణ చట్టంపై JPC నివేదికను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది కేంద్రం.. JPC ఛైర్మన్‌ జగదాంబికాపాల్‌ నివేదికను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నివేదికను ప్రవేశపెట్టగానే విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ బిల్లుతో వక్ఫ్‌ బోర్డు ఆస్తులను లాక్కునే కుట్ర జరుగుతోందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. తమ అభిప్రాయాలను పరిగణ లోకి తీసుకోకుండానే నివేదికను తయారు చేశారని ఆరోపించారు.

అయితే వక్ఫ్‌ బోర్డు సవరణ చట్టంతో వక్ఫ్‌ బోర్డు ముస్లింలకు మరింత దూరమవుతున్నారు మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. ఏ మతాలకు లేని ఆంక్షలు ముస్లింలకు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.

రాజ్యసభలో కూడా విపక్షాల తీవ్ర నిరసనల మధ్యే JPC నివేదికను సభలో ప్రవేశపెట్టారు. కేంద్రం తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ప్రతిపక్షాల తీరుపై రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

మరోవైపు కొత్త ఐటీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. లోక్‌సభ సమావేశాలు మార్చి 10వ తేదీ వరకు వాయిదా పడ్డాయి. ఆరు దశాబ్దాల IT చట్టం, 1961 నాటి IT చట్టం స్థానంలో కొత్త చట్టం రాబోతోంది. కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మల నిర్మలా సీతారామన్‌ ఈనెల ఒకటోతేదీ నాటి తనబడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. ఇన్‌కమ్‌ట్యాక్స్‌ చట్టాన్ని సరళీకరించడంలో భాగంగానే కేంద్రం కొత్త చట్టాన్ని కేంద్రం తీసుకువస్తోంది. ఈ బిల్లుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

బడ్జెట్‌పై రాజ్యసభలో సమాధానమిచ్చారు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై కేంద్ర వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..