
చిల్లర విషయంలో జరిగిన గొడవలో ప్రయాణీకుడిపై వేడి వేడి నీరు పోసినందుకు ప్యాంట్రీ కార్ ఉద్యోగిని అరెస్టైన ఘటన తిరువనంతపురం వెళ్తున్న నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. నేత్రావతి ట్రైన్‌లో ప్రయాణిస్తున్న 24 ఏళ్ల ముంబైకి చెందిన అభిషేక్ బాబుపై దాడి చేసిన కారణంగా
ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాంట్రీ కార్ ఉద్యోగి రాఘవేంద్ర సింగ్‌ను షోరనూర్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అభిషేక్ బాబు తన స్నేహితులతో కలిసి త్రిస్సూర్‌లోని మరో స్నేహితుడి ఇంటికి వెళ్లేందుకు నేత్రావతి ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కాడు. అయితే రాత్రిపూట అభిషేక్ దగ్గర ఉన్న బాటిల్‌లో వాటర్ అయిపోవడంతో, అతను మరో బాటిల్ కొనడానికి పాంట్రీ కారు వద్దకు వెళ్లాడు. అయితే బాటిల్ కోసం అభిషేక్ రూ.200 నోట్ ఇవ్వగా చిల్లర లేదని రూ.15 చిల్ల ఇవ్వాలని ప్యాంట్రీ కారు ఉద్యోగి కోరారు.
వారు కూడా చిల్లర లేదనడంతో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. కాసేపటి తర్వాత అభిషేక్ అతని స్నేహితులు అక్కడి నుంచి వెళ్లి తమ సీట్లలో వాళ్లు కూర్చున్నారు. అయితే బాటిల్ కోసం వచ్చిన అభిషేక్ ప్యాంట్రీ కార్ వద్దే తమ తమ అద్దాలు, క్యాప్‌ను మర్చిపోయి వెళ్లారు. దీంతో అవి తీసుకునేందుకు మళ్లీ అక్కడికి వెళ్లారు. అయితే వాటిన ఉదయం ఇస్తానని ప్యాంట్రీ కార్ ఉద్యోగి చెప్పాడు. ఉదయం మళ్లీ వెళ్లి అడినప్పుడు ఆ ఉద్యోగి గ్లాసెస్, క్యాప్ తిరిగి ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో మరోసారి ఇరువురి మధ్య వివాదం చెలరేగింది.
దీంతో రెచ్చిపోయిన పాంట్రీ కార్ ఉద్యోగి రాగేంద్ర తన దగ్గర స్టీల్ బకెట్‌లో ఉన్న వేడివేడి నీటి అభిషేక్, అతని ఫ్రెండ్స్ పై పోశాడు. దీంతో వారు ఘటనపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి పాంట్రీ కార్ ఉద్యోగిని అరెస్టు చేశారు. ఉద్యోగి దాడిలో అభిషేక్ బాబు వీపు, కాళ్ళపై కాలిన గాయాలు అయ్యాయి. అతను త్రిస్సూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అరెస్టు చేసిన నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.