
CM Mamata Banerjee: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ఆర్ధిక సంవత్సరానికి తమ బడ్జెట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ లో ఆమె..ఆయన పేరును పదేపదే ప్రస్తావించారు. నేతాజీ ఈ దేశానికి ఓ దిక్సూచి అని, ఆయన సందేశాలు తననెంతో ప్రభావితం చేశాయని ఆమె అన్నారు. నేతాజీ స్మారక ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయిస్తోందని ఆమె ప్రకటించారు. సుభాష్ చంద్ర బోస్ గౌరవ చిహ్నంగా రాష్ట్రంలో ఎక్కడా భారీ స్మారకాలను నిర్మించలేదని, అందువల్ల ఈ రాష్ట్ర ప్రజల తరఫున న్యూ టౌన్ ప్రాంతంలో ఆజాద్ హింద్ భవనాన్ని నిర్మించాలని యోచిస్తున్నామని దీదీ తెలిపారు.
అలాగే ప్రతి జిల్లాలో నేతాజీ పేరిట ‘జైహింద్’ భవనాలను నిర్మిస్తామని, యువతను మోటివేట్ చేయడమే తమ ఉద్దేశమని ఆమె అన్నారు. సుభాష్ చంద్రబోస్ పేరిట 10 కోట్ల వ్యయంతో నేతాజీ బెటాలియన్ ని ఏర్పాటు చేస్తాం, ప్రస్తుతం దీన్ని కోల్ కతా పోలీసు బెటాలియన్ గా వ్యవహరిస్తున్నాం అని ఆమె చెప్పారు. అలాగే నేతాజీ స్టేట్ ప్లానింగ్ కమిషన్ ని 5 కోట్లతో ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ వెల్లడించారు. దేశం నేతాజీ 125 వ జయంతి ఉత్సవాలను జరుపుకొంటున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మరో మూడు నాలుగు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమత.. నేతాజీ అంశాన్ని బీజేపీ ‘హైజాక్’ చేయకుండా చూసేందుకు ఇలా తమ తాత్కాలిక బడ్జెట్ లో ఇంత అత్యధిక వ్యయాన్ని ఈ ప్రాజెక్టులకు కేటాయించడం విశేషం.
Read More:
TDP MLA Ganta: సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే గంటా.. శాసనసభ్యత్వానికి రాజీనామా
CRPF Women Commandos: కీలక నిర్ణయం.. నక్సలైట్ల ప్రాబల్య ప్రాంతాలకు సీఆర్‌పీఎఫ్ మహిళా కమెండోలు..!
దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ వాసి.. మంత్రి కేటీఆర్ చొరవతో మృతదేహం స్వగ్రామానికి..