Inflation: తగ్గుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు.. ధరలు తగ్గే అవకాశం ఉందంటున్న నెస్లే ఇండియా ఛైర్మన్

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఉత్పత్తుల ధరలను తగ్గించే అవకాశం ఉందని.. వీటివల్ల ఈ ఆర్థిక సంవత్సర అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నట్లు ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఛైర్మన్‌, ఎండీ సురేశ్‌ నారాయణన్‌ పేర్కొన్నారు.

Inflation: తగ్గుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు.. ధరలు తగ్గే అవకాశం ఉందంటున్న నెస్లే ఇండియా ఛైర్మన్
Suresh Narayanan

Updated on: Apr 29, 2023 | 9:54 AM

ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ఉత్పత్తుల ధరలను తగ్గించే అవకాశం ఉందని.. వీటివల్ల ఈ ఆర్థిక సంవత్సర అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నట్లు ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం నెస్లే ఇండియా ఛైర్మన్‌, ఎండీ సురేశ్‌ నారాయణన్‌ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్న సంస్థ, ఈ ప్రాంతాల నుంచి 20 శాతానికి పైగా అమ్మకాలు వస్తాయని భావిస్తోంది. అలాగే ‘నెస్లే హెల్త్‌ సైన్స్‌’ పేరిట పాలు, న్యూట్రిషన్‌ ఉత్పత్తులతో, ఫార్మసీ విభాగంలో సైతం విస్తరిస్తోంది. ఈ ఏడాది రుతుపవనాల సమయంలో ఒకవేళ ఎల్‌నినో ప్రభావం లేకపోతే, వ్యవసాయం బాగుండి, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు గిరాకీ స్థిరంగా ఉంటుందని భావిస్తున్నాని తెలిపారుూ. గత ఆరు సంవత్సారాలుగా చూస్తే 20 త్రైమాసికాల్లో కంపెనీ పరిమాణం పరంగా అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. అయితే ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 5% అమ్మకాలు పెరిగాయి. భవిష్యత్తులో ధరల ఒత్తిళ్లు మరింత తగ్గి, పరిమాణం-విలువ ఆధారంగా అమ్మకాల్లో వృద్ధిలో సమతుల్యత సాధిస్తామని నారాయణన్‌ అంచనా వేశారు. గత ఆరేడేళ్లలో 10-11% వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు.

అయితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గితే, ఆ ప్రయోజనాన్ని కొనుగోలుదార్లకు బదిలీ చేస్తారా అన్న విషయంపై చర్యలను మేము తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ ముడిపదార్థాల ధరల్లో గణనీయంగా మార్పులు వస్తే మాత్రం, తప్పకుండా ఉత్పత్తుల ధరలను తగ్గించడం లేదా ప్రయోజనాలు కల్పించడం చేస్తామని వివరించారు.
పెరుగుతున్న గిరాకీని అందుకునేందుకు భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి కొత్త ప్లాంటు ఏర్పాటు చేసేందుకు నెస్లే సన్నాహాలు చేస్తోందని నారాయణ్ తెలిపారు. దేశంలో నెస్లేకు ఇది 10వ ప్లాంట్ కానుందని అన్నారు. ఇదిలా ఉండగా గత ఏడాది ఈ కంపెనీ భారత్‌లో రూ.5000 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ప్రస్తుత యూనిట్‌ల సామర్థ్యాలను పెంచేందుకు కూడా కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..