కరోనా కాలంలో భారీగా పెరిగిన విదేశీ మారక నిల్వలు

|

Sep 12, 2020 | 6:20 PM

కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలన్నీ కుదైలైపోగా.. భారత ఖజానాలోమాత్రం విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగాయి. దేశ విదేశీ మారక నిల్వలు 582 మిలియన్ డాలర్లు పెరిగి సెప్టెంబర్ 4 తో ముగిసిన వారంలో జీవితకాల...

కరోనా కాలంలో భారీగా పెరిగిన విదేశీ మారక నిల్వలు
Follow us on

కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలన్నీ కుదైలైపోగా.. భారత ఖజానాలోమాత్రం విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగాయి. దేశ విదేశీ మారక నిల్వలు 582 మిలియన్ డాలర్లు పెరిగి సెప్టెంబర్ 4 తో ముగిసిన వారంలో జీవితకాల గరిష్టం 542.013 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మొత్తం నిల్వలలో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 269 మిలియన్ డాలర్లు పెరిగి 498.362 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇక, బంగారు నిల్వలు 321 మిలియన్ డాలర్లు పెరిగి 37.521 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధితో ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు 2 మిలియన్ డాలర్లు పెరిగి 1.482 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఫలితంగా ఐఎంఎఫ్‌తో దేశ రిజర్వ్ స్థానం 9 మిలియన్ డాలర్లు తగ్గి 4.647 బిలియన్ డాలర్లకు చేరుకుంది.