బిగ్ బ్రేకింగ్ : రాజీనామా చేసిన “మహా” డిప్యూటీ సీఎం, ఫడ్నవీస్ కూడా..?

| Edited By:

Nov 26, 2019 | 4:16 PM

మహా రాజకీయం మరో మలుపు తిరిగింది. బలపరీక్షకు సమయం దగ్గరపడుతున్న వేళలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం ఫడ్నవీస్‌తో కలిసి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్.. తన పదవికి రాజీనామా చేేశారు. అయితే తన తండ్రి రాజీనామా చేయలేదని ఆయన కుమారుడు పార్థ్ పవార్ ప్రకటించారు. మరో వైపు సీఎం ఫడ్నవీస్ ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అజిత్ పవార్ […]

బిగ్ బ్రేకింగ్ : రాజీనామా చేసిన మహా డిప్యూటీ సీఎం, ఫడ్నవీస్ కూడా..?
Follow us on

మహా రాజకీయం మరో మలుపు తిరిగింది. బలపరీక్షకు సమయం దగ్గరపడుతున్న వేళలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం ఫడ్నవీస్‌తో కలిసి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్.. తన పదవికి రాజీనామా చేేశారు. అయితే తన తండ్రి రాజీనామా చేయలేదని ఆయన కుమారుడు పార్థ్ పవార్ ప్రకటించారు. మరో వైపు సీఎం ఫడ్నవీస్ ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అజిత్ పవార్ మళ్లీ తన సొంత గూటికి చేరవచ్చునని తెలుస్తోంది. తాను ఎన్సీపీలోనే ఉన్నానని అజిత్ పవార్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. తమ అధినేత శరద్ పవారేనని  కూడా ఆయన స్పష్టం చేశారు.