పంజాబ్ లో ‘కరెంట్ బేరసారాలు’.. ప్రజలకు సిద్దు, సీఎంల ‘తాయిలాలు’ ! ఎన్నికల ముందే ఎత్తుకు పైఎత్తులు

| Edited By: Phani CH

Jul 04, 2021 | 4:01 PM

తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పంజాబ్ ప్రజలకు ఓ వైపు మాజీ మంత్రి, మాజీ క్రికెటర్, నవజ్యోత్ సింగ్ సిద్దు, మరోవైపు సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ 'అర చేతిలో వైకుంఠం' చూపుతున్నారు.

పంజాబ్ లో కరెంట్ బేరసారాలు.. ప్రజలకు సిద్దు, సీఎంల తాయిలాలు ! ఎన్నికల ముందే ఎత్తుకు పైఎత్తులు
Navajyot Singh Sidhu
Follow us on

తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పంజాబ్ ప్రజలకు ఓ వైపు మాజీ మంత్రి, మాజీ క్రికెటర్, నవజ్యోత్ సింగ్ సిద్దు, మరోవైపు సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ‘అర చేతిలో వైకుంఠం’ చూపుతున్నారు. తమ రాష్ట్ర ప్రజలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ని ఇవ్వవచ్చునని. అలాగే 24 గంటలూ కట్స్ లేకుండా పవర్ ఇచ్చే వీలు కూడా ఉందని సిద్దు తెలిపారు. చౌక ధరలకు గృహ, పారిశ్రామిక యూనిట్లకు విద్యుత్తును ఇవ్వవచ్చు కూడా అని ఆయన చెప్పారు. రాష్ట్రం ఇప్పటికే 9 వేల కోట్ల సబ్సిడీని ఇస్తోందని..ముఖ్యంగా గృహ, పారిశ్రామిక అవసరాలకు యూనిట్ కి 10 నుంచి 12 రూపాయల సర్ ఛార్జి బదులు 3 నుంచి 5 రూపాయల వరకు ఇవ్వవచ్చునని ఆయన వివరించారు.

పైగా అసలు సరఫరాలో అంతరాయమన్నదే లేకుండా 24 గంటలూ ఇవ్వడానికి వీలవుతుందన్నారు. ఇది ముమ్మాటికీ సాధ్యమవుతుందన్నారు. ఇదివరకటి బీజేపీ-శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న తప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఓ చట్టం ద్వారా రద్దు చేయవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచించిన 18 పాయింట్ల అజెండాతో మొదలు పెడదామని, పాత కొనుగోలు ఒప్పందాలను కొత్త చట్టంతో రద్దు చేద్దామని నవజ్యోత్ సింగ్ సిద్దు పేర్కొన్నారు. పంజాబ్ లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఫ్రీగా ఇస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల హామీ ఇచ్చారు. దానికి కౌంటర్ గా సిద్దు ఈ ప్రకటన చేసినట్టు కనబడుతోంది.

ఇక సీఎం అమరేందర్ సింగ్ కూడా.. పాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను తప్పు పడుతున్నారు. అవి మోసపూరిత ఒప్పందాలుగా ఉన్నాయని…వాటికి కౌంటర్ గా తమ ప్రభుత్వం త్వరలో లీగల్ స్ట్రాటజీని ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. ఈ ఒప్పందాలను తాము సమీక్షిస్తున్నామని..అవి రాష్ట్రంపై అనవసర ఆర్ధిక భారాన్ని మోపాయని ఆయన పేర్కొన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: రెజ్లింగ్ మ్యాచ్ లు చూస్తా….నాకు టీవీ కావాలి…తీహార్ జైలు అధికారులకు రెజ్లర్ సుశీల్ కుమార్ లేఖ

Dimple Hayathi: బాలీవుడ్‏లోకి డింపుల్ హయాతి ?… వరుస ఆఫర్లతో ‘ఖిలాడి’ హీరోయిన్ బిజీ..