Omar Abdullah: అయ్యయ్యో తప్పైంది.. క్షమించండి..! తప్పులో కాలేసిన ఓ మాజీ ముఖ్యమంత్రి

Omar Abdullah apologize: ట్విట్టర్‌లో స్పీడ్‌గా ఉండే పొలిటికల్‌ లీడర్స్‌లో ఒమర్‌ అబ్దుల్లా ఒకరు. ఆ స్పీడ్‌ వల్లే ఆయనో పొరపాటు చేశారు. క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

Omar Abdullah: అయ్యయ్యో తప్పైంది.. క్షమించండి..! తప్పులో కాలేసిన ఓ మాజీ ముఖ్యమంత్రి
Omar Abdullah

Updated on: May 05, 2022 | 8:40 PM

జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాకు(Omar Abdullah) ట్విట్టర్‌లో 32 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వివిధ అంశాలపై ఆయన ట్వీట్స్‌ చేస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కమ్యూనికేషన్‌ వరకు ఒమర్‌ సమర్థంగా ట్విట్టర్‌ను వాడుకుంటారు. అయితే ఆయనో పొరపాటు చేశారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ లోక్‌సభ ఎంపీ అక్బర్‌ లోన్‌ చనిపోయారంటూ తప్పు సమాచారాన్ని ఒమర్‌ ట్విటర్‌లో పెట్టారు. ఒమర్‌ ట్వీట్‌ ఆధారంగా పీటీఐ వార్తా సంస్థ ఓ అలెర్ట్‌ పెట్టింది. దాంతో ఆ వార్త దావానలంలా పాకిపోయింది. దాని ఆధారంగా అస్వస్థతకు గురైన అక్బర్‌ లోన్‌ మరణించారంటూ అనేక న్యస్‌ వెబ్‌సైట్లు వార్తలు రాశాయి. అయితే ఒమర్‌కు తర్వాత అసలు విషయం తెలిసింది.

అక్బర్‌ లోన్‌ చనిపోలేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని ఒమర్‌కు సమాచారం అందింది. దాంతో ఎంత పెద్ద తప్పు చేశానో ఒమర్‌కు తెలిసొచ్చింది. వెంటనే ఆ తప్పు దిద్దుకున్నారు. అక్బర్‌ లోన్‌కు, ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. అక్బర్‌ లోన్‌కు సంబంధించిన వార్తను తన తండ్రి ఫరూక్‌ అబ్దుల్లా పొరపాటు అర్థం చేసుకున్నారని, దాన్ని బట్టి ట్వీట్‌తో తాను తప్పు చేశానని వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

అక్బర్‌ లోన్‌ ప్రముఖ నాయకుడు కావడంతో ఒమర్‌ సమాచారంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడింది. 75 సంవత్సరాల అక్బర్‌ లోన్‌ 2019లో బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచారు. అంతకుముందు మూడుసార్లు జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: PK Mission: కొత్త పార్టీ పెట్టడం లేదు.. పాదయాత్ర చేస్తాను.. ఆయన పాలనపై పీకే కీలక వ్యాఖ్యలు..

Terrorist Attack Plan: పాక్‌ నుంచి డ్రోన్‌ల సహాయంతో పేలుడు పదార్దాలు.. ఆదిలాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రకు పాకిస్తాన్‌లో ప్లాన్‌..

ఉత్కంఠ పోరులో వైసీపీకే దుగ్గిరాల ఎంపీపీ పీఠం.. వ్యూహాత్మకంగా గెలిచిన రూపవాణి..