పొలాల్లో హెలికాఫ్టర్ అత్యవసర లాండింగ్, జువెల్లర్ కుటుంబానికి తప్పిన ముప్పు

తమిళనాడుకు చెందిన ఓ జువెల్లర్ తన కుటుంబంతో కలిసి హెలికాఫ్టర్ లో తిరుపతికి బయల్దేరాడు. అయితే వాతావరణం బాగు లేకపోవడంతో హెలికాఫ్టర్ చిత్తూరు జిల్లా తిరుపత్తూరు-కుప్పం సరిహద్దుల్లోని నంగ్లి గ్రామ పొలాల్లో అత్యవసరంగా  ల్యాండ్ అయింది.

పొలాల్లో హెలికాఫ్టర్ అత్యవసర లాండింగ్, జువెల్లర్ కుటుంబానికి తప్పిన ముప్పు

Edited By:

Updated on: Oct 18, 2020 | 5:26 PM

తమిళనాడుకు చెందిన ఓ జువెల్లర్ తన కుటుంబంతో కలిసి హెలికాఫ్టర్ లో తిరుపతికి బయల్దేరాడు. అయితే వాతావరణం బాగు లేకపోవడంతో హెలికాఫ్టర్ చిత్తూరు జిల్లా తిరుపత్తూరు-కుప్పం సరిహద్దుల్లోని నంగ్లి గ్రామ పొలాల్లో అత్యవసరంగా  ల్యాండ్ అయింది. ఈ హెలీకాఫ్టర్లో ఇద్దరు పైలట్లు  ఉన్నారు. జువెల్లర్ కుటుంబం కోయంబత్తూరు నుంచి వస్తోంది. పొలాల్లో దిగిన హెలికాఫ్టర్ ను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం తెలిసిన తిరుపతి పోలీసులు వచ్చి పరిస్థితిని మదింపు చేశారు. కొద్దిసేపటికి వాతావరణం మెరుగుపడడంతో ఆభరణాల వ్యాపారి ఫ్యామిలీ హెలీకాఫ్టర్లో తిరుపతి బయల్దేరింది.