West Bengal: కేంద్రంతో ఢీ. ఎటాక్‌కు దీదీ సర్కారు కౌంటర్‌. ఈడీ, సీబీఐ అధికారులకు అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులు

|

Sep 14, 2021 | 6:03 PM

కేంద్రంతో వెస్ట్‌ బెంగాల్‌ సర్కార్‌ ఢీ అంటే ఢీ అంటోంది. ఈడీ ఎటాక్‌కు కౌంటర్‌ ఇచ్చింది దీదీ సర్కార్‌. ఈడీ, సీబీఐ అధికారులకు బెంగాల్

West Bengal: కేంద్రంతో ఢీ. ఎటాక్‌కు దీదీ సర్కారు కౌంటర్‌. ఈడీ, సీబీఐ అధికారులకు అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులు
Mamata Cbi Ed
Follow us on

Narada Case: కేంద్రంతో వెస్ట్‌ బెంగాల్‌ సర్కార్‌ ఢీ అంటే ఢీ అంటోంది. ఈడీ ఎటాక్‌కు కౌంటర్‌ ఇచ్చింది దీదీ సర్కార్‌. ఈడీ, సీబీఐ అధికారులకు బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులు ఇవ్వడం ప్రకంపనలు పుట్టిస్తోంది. కాగా, కొంతకాలంగా వెస్ట్‌బెంగాల్‌ సర్కార్‌ ఉక్కిబిక్కిరి అవుతోన్న సంగతి తెలిసిందే. ఓవైపు సీబీఐ.. మరోవైపు ఈడీ దాడితో ప్రభుత్వ పెద్దలకు చెమటలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు దిమ్మదిరిగే కౌంటర్‌ ఇచ్చింది మమత సర్కార్‌.

లేటెస్ట్‌గా వెస్ట్‌బెంగాల్‌ అసెంబ్లీ స్పీకర్‌ భీమన్‌ బెనర్జీ అటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఇటు సీబీఐకి నోటీసులు జారీ చేశారు. నారదా స్కామ్‌లో ఇటీవల పలువురు ప్రజాప్రతినిధుల పేర్లను చార్జ్‌షీట్లో చేర్చింది ఈడీ. ఈ విషయాన్ని తనకు ఎందుకు తెలియజేయలేదంటూ సమన్లు ఇచ్చారు స్పీకర్‌. ఈనెల 22న అసెంబ్లీలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. నారదా స్కామ్‌లో మొన్న మంత్రులకు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులకు ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది.

పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం ఓవైపు సీబీఐ ఎంక్వైరీ నడుస్తోంది. ఎన్నికల తర్వాత జరిగిన హింసపై విచారణ చేస్తోంది సీబీఐ. హింసకు సంబంధించి 30కి పైగా ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. తమ నేతలనే టార్గెట్‌ చేస్తూ సీబీఐ కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తోంది తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ). కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం లక్ష్యం చేసుకుందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతోందని విమర్శిస్తున్నారు. దీనికి విరుగుడుగా స్పీకర్‌ ఈడీ, సీబీఐ అధికారులకు నోటీసులు జారీ చేశారన్న ప్రచారం సాగుతోంది.

ఇటీవలే నారద స్టింగ్ టేప్స్ కేసులో ఈడీ ప్రత్యేక కోర్టుకు ఛార్జ్‌షీట్‌ సమర్పించిన సంగతి తెలిసిందే. మంత్రులు ఫిర్హాద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీ, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ప్రత్యేక కోర్టు ఛార్జ్‌షీట్‌లోని నలుగురు టీఎంసీ నేతలకు సమన్లు జారీచేసింది. ఈనెల 16న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

Read also: Minister Malla Reddy: తప్పకుండా వాడ్ని ఎన్‌కౌంటర్ చేసి పారేస్తాం.. మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన