Watch Video: గాల్లో కుదుపులకు గురైన స్పైస్‌ జెట్‌ విమానం.. గాయాల పాలైన ప్రయాణికులు..

Spicejet: స్పైస్‌ జెట్‌కు చెందిన విమానం గాల్లో భారీ కుదుపులకు లోనైంది. ఈ సంఘటన ఆదివారం సాయత్రం జరిగింది. స్పైస్‌ జెట్‌ ఎయిర్‌ వేస్‌కు చెందిన బోయింగ్‌ బీ737 విమానం ముంబయి నుంచి పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్‌కు వెళుతోంది. మరికాసేపట్లో ల్యాండ్‌ అవుతోందన్న..

Watch Video: గాల్లో కుదుపులకు గురైన స్పైస్‌ జెట్‌ విమానం.. గాయాల పాలైన ప్రయాణికులు..
Spicejet

Updated on: May 02, 2022 | 1:01 PM

Spicejet: స్పైస్‌ జెట్‌కు చెందిన విమానం గాల్లో భారీ కుదుపులకు లోనైంది. ఈ సంఘటన ఆదివారం సాయత్రం జరిగింది. స్పైస్‌ జెట్‌ ఎయిర్‌ వేస్‌కు చెందిన బోయింగ్‌ బీ737 విమానం ముంబయి నుంచి పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్‌కు వెళుతోంది. మరికాసేపట్లో ల్యాండ్‌ అవుతోందన్న సమయంలోనే విమానం ఒక్కసారిగా భారీ కుదుపులకు లోనైంది. భూమికి కొన్ని వందల అడుగులు ఎత్తులో విమానం కుదుపులకు గురయ్యేసరికి ప్రయాణికులు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

అయితే తర్వాత విమానం క్షేమంగా ల్యాండ్‌ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పైస్‌ జెట్‌ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు స్పైస్‌జెట్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఇదే విషయమై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సోమవారం విచారణకు ఆదేశించింది. ఇక విమానం కుదుపులకు గురైన సమయంలో విమానం లోపల ఉన్న ప్రయాణికులు కొందరు తమ స్మార్ట్‌ ఫోన్‌లలో చిత్రీకరించారు. ఆ సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: US Firing: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. షికాగోలో వేర్వేరు ఘటనల్లో 8మంది మృతి, 42 మందికి గాయాలు!

Minister Thalasani Srinivas Yadav: సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్దదిక్కు.. మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్..

News Watch LIVE: నువ్వొస్తానంటే, మేమొద్దంటాము..! మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్..(వీడియో)