ఉత్తరాఖండ్ లో ఒకరోజు ముఖ్యమంత్రిగా 19 ఏళ్ళ విద్యార్థిని సృష్టి గోస్వామి ‘పదవి చేబట్టింది’. జాతీయ బాలికా దినోత్సవం (నేషనల్ గర్ల్ చైల్డ్ డే) సందర్భంగా ఈమెను అక్కడి ప్రభుత్వం ఒకరోజు సీఎంను చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఈమె తండ్రి ప్రవీణ్ పురి..నేటి తరం బాలికలు ఏదైనా సాధించగలరని అన్నారు. తన కుమార్తె ఈ మైల్ స్టోన్ సాధించినదంటే ప్రతి అమ్మాయీ ఏదైనా సాధించగలదని భావిస్తున్నానన్నారు. మా కూతురుకు ఈ అవకాశాన్ని ఇఛ్చినందుకు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పారు. కాగా తనకు ప్రభుత్వం ఒకరోజు ముఖ్యమంత్రి ‘పదవి’ ని ఇచ్చినందుకు సృష్టి గోస్వామి పొంగిపోయింది. వివిధ శాఖలను తాను విజిట్ చేసి తన సూచనలను సిబ్బందికి తెలియజేస్తానని చెప్పింది. ముఖ్యంగా బాలికల విద్య తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తానని పేర్కొంది.
బాలికలకు కూడా సమాజంలో ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో 2008 లో నాటి ప్రభుత్వం ప్రతి ఏడాదీ జనవరి 24 న నేషనల్ గర్ల్ చైల్డ్ డే ) గా పాటించాలని పిలుపునిచ్చింది.