Mysore Collector: జిల్లా కలెక్టర్ అంటే సమాజంలో ఎంతటి గౌరవం, మర్యాదలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆ దర్పం, ఆ కాన్వాయ్, ఆ సెక్యూరిటీ.. చెప్పుకోవాలంటే చాలనే ఉన్నాయి. భారతదేశ పరిపాలనా వ్యవస్థలో అంత్యంత కీలకమైనది కలెక్టర్ ఉద్యోగం. కలెక్టర్ ఆదేశిస్తే ఏదైనా తన చెంతకు రావాల్సిందే. అయితే ఇక్కడ ఓ కలెక్టర్ తన హోదాను, తన పదవిని, అన్నీ పక్కనబెట్టారు. తనకు వచ్చిన సమస్యను తానే పరిష్కరించారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. కర్ణాటకలోని మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా.. కార్ టైర్ పంచర్ అయ్యింది.
దాంతో కారును పక్కకు ఆపారు. మెకానిక్ అందుబాటులో లేకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగింది. పంచర్ అయిన కారు టైర్‌ను తొలిగించింది. కొత్త టైర్‌ను మార్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, రోహిణి సింధూరి తన కారు టైర్‌ను తీస్తుండగా.. రోడ్డుపై వెళ్తున్న పలువురు ఆమెను గుర్తించారు. మీరు మైసూర్ కలెక్టర్ కదా? అని ప్రశ్నించారు. దానికి ఆమె నవ్వుతూ అవును అంటూ సమాధానం ఇచ్చారు. ఈ మాటలన్నీ వీడియోలో రికార్డ్ అయ్యాయి. కాగా, సోషల్ మీడియాలో కలెక్టర్ టైర్ మారుస్తున్న వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కలెక్టర్ హోదాలో ఉండి కూడా తానే స్వయంగా కారు టైర్ మార్చడం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. సాల్యూట్ కలెక్టర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also read: