Puri Jagannath Temple: ఒడిసాలోని పూరీలో కొలువైన జగన్నాథస్వామి ఆలయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్నాథుని రత్నభాండాగారం తెరవడంలో గందరగోళం కొనసాగుతోంది. రత్నభాండాగారంలోని మూడో గది నుంచి సొరంగ మార్గం ఉందని ప్రచారం జరుగుతోంది. అందులో భారీగా భారీగా వజ్ర, వైడూర్య, కెంపులు, రత్నాలు, స్వర్ణ కిరీటాలు ఇలా ఎన్నో అందులో నిక్షిప్తమై ఉన్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రత్నభాండాగారంలో సంపద లెక్కగట్టలేనంత భారీగా ఉందని చెబుతున్నారు. అసలు మూడో గదిని ఎందుకు తెరవట్లేరని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు..ఈ భాండాగారానికి చెందిన మూడో గది నుంచి రహస్యంగా సొరంగ మార్గం ఉందని కూడా ప్రచారం నడుస్తోంది.
1926లో అప్పటి బ్రిటిష్ పాలకులు ఆ రత్న భాండాగారాన్ని తెరిపించి, ఆభరణాలను లెక్కించారు. చెన్నైకి చెందిన నిపుణులు ఆ ఆభరణాలను లెక్కించి.. అందులో 597 రకాల విలులైన ఆభరణాలు ఉన్నాయని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీక్షేత్ర ఆస్తుల పట్టికలో పేర్కొన్నారు. ఈ వివరానలు ఇటీవలే ఓ చరిత్రకారుడు మీడియాకు తెలిపారు. రహస్యగదికి కింది భాగంలోనే సొరంగమార్గం ఉందని చెప్పారు. అంతేగాక, దాని కింద కూడా మరిన్ని గదులు ఉన్నాయని తెలిపారు. భూగర్భంలో ఉన్న ఆ గదులకు కొన్నేళ్ళ క్రితం నిపుణులు వెళ్ళడానికి ప్రయత్నించగా అక్కడ పాములు బుసలు కొడుతున్న శబ్దాలు వినిపించాయని చెప్పారు.
12వ శతాబ్దం మొదలు 18వ శతాబ్దం వరకు ఉత్కళను పరిపాలించిన 46 మంది రాజులు ఈ సంపదను రహస్య గదుల్లో దాచినట్లు తెలిపారు. ఆ రాజులు అందరూ పురుషోత్తముడి భక్తులని, ఆ రాజులే స్వామివారి కోసం వెలకట్టలేని సంపదను అక్కడి రహస్య గదుల్లో దాచినట్లు వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి