తనకు పాస్ పోర్ట్ జారీ చేసేందుకు అధికారులు నిరాకరించడాన్ని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తప్పు పట్టారు. నేనేమైనా దేశ వ్యతిరేకినా అని ఆమె ప్రశ్నించారు. సీఐడీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నాకు పాస్ పోర్టు ఇవ్వరాదని అంటున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి దేశ వ్యతిరేకిగానో లేదా లేదా దేశానికి ముప్పుగానో మారుతారా అని ఆమె ప్రశ్నించారు. తనకు పాస్ పోర్టు జారీ చేస్తే దేశ భద్రతకు హానికరమని సీఐడీ ఇచ్చిన నివేదికను బట్టి పాస్ పోర్ట్ కార్యాలయం పాస్ పోర్టు ఇవ్వడానికి నిరాకరించిందని, ఇది కాశ్మీర్ లో నెలకొన్న ‘సాధారణ పరిస్థితులకు ఉదాహరణ’ అని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు పాస్ పోర్టు ఇవ్వడం కుదరదంటూ విదేశాంగ శాఖ పంపిన కాపీని కూడా ఆమె మీడియాకు అందజేశారు. తన పాత పాస్ పోర్ట్ గడువు గత మే 31 న ముగియడంతో మెహబూబా ముఫ్తీ కొత్త దాని కోసం గత డిసెంబరులో దరఖాస్తు చేశారు .అయితే పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టు జాప్యం కావడంతో ఈ దరఖాస్తును పాస్ పోర్టు కార్యాలయం క్లియర్ చేయలేకపోయింది. సీఐడీ విభాగం ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మీకు దీన్ని జారీ చేయలేమనిఅధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె హైకోర్టు దృష్టికి తేవచ్చునన్నారు.
అటు- ఈ వ్యవహారంపై హైకోర్టులో విదేశాంగ శాఖ తరఫు న్యాయవాది, ముఫ్తీ తరఫు లాయర్ తమతమ వాదనలను వినిపిస్తున్నారు. ఈ వాదనల నేపథ్యంలో పాస్ పోర్టు కార్యాలయం ఈమెకు పాస్ పోర్టు జారీ చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
మరిన్ని చదవండి ఇక్కడ :Chasing Video :బస్సును చేజ్ చెయ్..అంటు బైకర్ ను ఆపి రిక్వెస్ట్ చేసిన పోలీస్..( వీడియో ).
Glass Bridge: హాట్ టాపిక్‌గా మారిన చైనా లో మరో అద్భుత కట్టడం…!! తప్పక చూడాల్సిందే… ( వీడియో )
Viral Video: పాముపై ఊరేగిన కప్ప…!! స్నేహితులుగా మారిన ఆగర్భ శత్రువులు… ( వీడియో )