My Home Group: గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌లో మెరిసిన మై హోమ్ గ్రూప్.. నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో నవంబర్ 27న గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుండి ప్రముఖులు హాజరయ్యారు. మై హోమ్ గ్రూప్ కన్‌స్ట్రక్షన్ వివిధ విభాగాలలో మొత్తం నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

My Home Group: గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌లో మెరిసిన మై హోమ్ గ్రూప్.. నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు
IGBC Green Building Congress

Updated on: Nov 27, 2025 | 9:51 PM

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ – 2025 కార్యక్రమంలో మై హోమ్ కన్‌స్ట్రక్షన్ గ్రూప్‌కు నాలుగు విభిన్న విభాగాల్లో పురస్కారాలు లభించాయి. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) ప్రతినిధులు, మై హోమ్ గ్రూప్ చేపట్టిన సుస్థిర నిర్మాణ పద్ధతులు, పర్యావరణ అనుకూల ప్రాజెక్టులు, నూతన టెక్నాలజీల వినియోగాన్ని ప్రశంసిస్తూ ఈ అవార్డులను అందజేశారు.

మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్, మై హోమ్ ట్విట్జా అనే రెండు వాణిజ్య ప్రాజెక్టులు నెట్ జీరో సర్టిఫికేషన్లను పొందడం విశేషం. ముఖ్యంగా, ప్రీకాస్ట్ టెక్నాలజీతో నిర్మించిన మై హోమ్ గ్రావా బిజినెస్ పార్క్‌కు నెట్ జీరో వేస్ట్ ప్లాటినం రేటింగ్, నెట్ జీరో వాటర్ పాజిటివ్, నెట్ జీరో ఎనర్జీ గుర్తింపులు లభించాయి.

అదేవిధంగా, మై హోమ్ ట్విట్జాకు కూడా వాణిజ్య యూనిట్‌ల విభాగంలో నెట్ జీరో వేస్ట్ ప్లాటినం రేటెడ్ అవార్డుని గెలుచుకుంది. ఈ పురస్కారాలు మై హోమ్ గ్రూప్ సుస్థిర అభివృద్ధి, పచ్చదనానికి అనుగుణమైన కట్టడ నిర్మాణ ప్రమాణాలపై కొనసాగుతున్న కట్టుబాటును మరోసారి నిరూపిస్తున్నాయి.

ఈ అవార్డులు అన్ని కలిపి చూస్తే..  మై హోమ్ గ్రూప్ పర్యావరణ పరిరక్షణ, రిసోర్స్ కన్జర్వేషన్, సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న మార్గదర్శక సంస్థగా నిలుస్తుందని స్పష్టమవుతోంది. దేశంలో గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌కు మై హోమ్ గ్రూప్ ఒక బెంచ్‌మార్క్‌గా మారుతున్నట్లు పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అవార్డు ప్రాముఖ్యత ఏమిటి?

నిర్మాణ రంగంలో అత్యుత్తమ విజయాలను గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో అవార్డు అందుకోవడం చాలా ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తారు. చాలా కంపెనీలు ఈ అవార్డు కోసం పోటీ పడతాయి ఈ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్స్ వివిధ విభాగాలలో మొత్తం నాలుగు అవార్డులను అందుకుంది.