రాముని వంశస్థులం మేమే.. రాజస్థాన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

అయోధ్య రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు రోజువారీ విచారణ చేస్తున్న విషయం తెలిసింది. అయితే రాముడి వారసులు ఎవరైనా ఉన్నారా? అంటూ శుక్రవారం రాంలల్లా విరాజ్‌మాన్ తరఫు న్యాయవాదిని ఆసక్తికర ప్రశ్న వేసింది ధర్మాసనం. తాము ఈ ప్రశ్నకు జవాబు కోసం చాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కూడా పేర్కొంది. అయితే వీటిని సంబంధించిన వివరాలు త్వరలోనే ధర్మాసనం ముందు పెడతానని బదులిచ్చారు. తాజాగా రాముని వంశస్థులం మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. పైగా మా వంశం దేశమంతా […]

రాముని వంశస్థులం మేమే.. రాజస్థాన్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Edited By:

Updated on: Aug 12, 2019 | 12:17 PM

అయోధ్య రామజన్మభూమి వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు రోజువారీ విచారణ చేస్తున్న విషయం తెలిసింది. అయితే రాముడి వారసులు ఎవరైనా ఉన్నారా? అంటూ శుక్రవారం రాంలల్లా విరాజ్‌మాన్ తరఫు న్యాయవాదిని ఆసక్తికర ప్రశ్న వేసింది ధర్మాసనం. తాము ఈ ప్రశ్నకు జవాబు కోసం చాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని కూడా పేర్కొంది. అయితే వీటిని సంబంధించిన వివరాలు త్వరలోనే ధర్మాసనం ముందు పెడతానని బదులిచ్చారు.

తాజాగా రాముని వంశస్థులం మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. పైగా మా వంశం దేశమంతా విస్తరించి ఉన్నామని కూడా చెబతున్నారు. రాజస్థాన్‌లోని రాజసమంద్ పార్లమెంట్ సభ్యురాలు దియా కుమారి తాము రఘువంశస్థులమని.. లవ కుశుల్లో కుశుడి వంశం మాదేనంటూ ఆమె ప్రకటించారు. దియా కుమారి పూర్వ జైపూర్ రాజకుటుంబానికి చెందినవారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

రఘవంశానికి సంబంధించి తమ వద్ద శాసనాలు, ఇతర ఆధారాలు మావద్ద ఉన్నాయంటూ గట్టిగానే చెబుతున్నారు. అయోధ్యతో పాటు దేశ వ్యాప్తంగా మా వంశం విస్తరించి ఉన్నామని తెలిపారు. తమ వంశానికి సంబంధించి అన్ని ఆధారాలతో సహా త్వరలోనే వివాదం పరిష్కారం కానుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వివాదాస్పదంగా మారిన అయోధ్య కేసులో దియా కుమారి వ్యాఖ్యలు సంచలనం రేకిత్తించాయి.