Delhi CM Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కొన్నిరోజుల క్రితం కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆక్సిజన్, మందులు, బెడ్ల కొరత తీవ్రంగా వేధించింది. ఆక్సిజన్ కొరతతో చాలామంది మరణించారు. అయితే.. ఈ సమయంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఆక్సిజన్ అవసరాన్ని నాలుగు రెట్లు అత్యధికంగా చేసి చూపించిందని.. సుప్రీం ప్యానల్ మధ్యంతర నివేదికలో పేర్కొనడం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ఇదే విషయాన్ని బీజేపీ ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ ప్రభుత్వంపై దాడి చేస్తోంది. కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీకి చెందిన 2 కోట్ల మంది ప్రజల కోసం పోరాడటమే నేను చేసిన పెద్ద నేరమా అంటూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఢిల్లీకి చెందిన 2 కోట్ల మంది ప్రజల కోసం పోరాడటమే నేను చేసిన పెద్ద నేరం.. ఆ విపత్కర సమయంలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీల్లో బిజీబిజీగా ఉండిపోయారు. ఆ సమయంలో నేను అహోరాత్రులు శ్రమించి, ఢిల్లీ ప్రజలకు ఏర్పడ్డ ఆక్సిజన్ కొరతను నివారించగలిగాను అంటూ ట్విట్ చేశారు. కరోనా కారణంగా ప్రజలు తమతమ కుటుంబీకులను కోల్పోయి, తీవ్ర మనోవేదనలో మిగిలిపోయారు. లేనిపోని తప్పులు చెప్పకండి. వారికి అసహ్యం వేస్తుంది అంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా బీజేపీ, ప్యానల్ తీరుపై మండిపడ్డారు.
मेरा गुनाह-मैं अपने 2 करोड़ लोगों की साँसों के लिए लड़ा
जब आप चुनावी रैली कर रहे थे, मैं रात भर जग कर Oxygen का इंतज़ाम कर रहा था। लोगों को ऑक्सिजन दिलाने के लिए मैं लड़ा, गिड़गिड़ाया
लोगों ने ऑक्सिजन की कमी से अपनों को खोया है। उन्हें झूठा मत कहिए, उन्हें बहुत बुरा लग रहा है
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 25, 2021
Also Read: