SS Thaman: ఇండస్ట్రీకి వచ్చి 26 ఏళ్లు గడిచిపోయాయి… ప్రతి సినిమాకు 100 శాతం కష్టపడతా… సంగీత దర్శకుడు తమన్…

| Edited By:

Jan 04, 2021 | 10:56 AM

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 26 ఏళ్లు గడిచిపోయాయని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. తన కెరీర్‌లో ‘అరవిందసమేత వీరరాఘవ’...

SS Thaman: ఇండస్ట్రీకి వచ్చి 26 ఏళ్లు గడిచిపోయాయి... ప్రతి సినిమాకు 100 శాతం కష్టపడతా... సంగీత దర్శకుడు తమన్...
Follow us on

SS Thaman: సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 26 ఏళ్లు గడిచిపోయాయని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. తన కెరీర్‌లో ‘అరవిందసమేత వీరరాఘవ’ వందో చిత్రమని తనకు ముందు తెలీదని అన్నారు. ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. ఈ చిత్రానికి మ్యూజిక్ తమన్ కంపోజ్ చేశారు. ఈ సందర్భంగా తమన్ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమా పాటలు ఎంత హిట్‌ అయ్యాయో తెలిసిందే. ఆ సినిమా తర్వాత తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఒత్తిడిగా భావించలేదని తెలిపారు. ప్రతి సినిమాకి బాధ్యతగా 100 శాతం కష్టపడతానని, అది చిన్నదా, పెద్దదా అనే తేడా ఎప్పుడూ ఉండదని అన్నారు.

 

హిట్ కాంబినేషన్…

రవితేజగారు, నా కాంబినేషన్‌లో వస్తున్న పదో చిత్రం ‘క్రాక్‌’. పని విషయంలో ఆయన పూర్తి ఫ్రీడమ్‌ ఇస్తారు. సరదాగా సినిమా పూర్తి చేయొచ్చు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి, కథకి ఎటువంటి సంగీతం ఇవ్వాలో నాకు తెలుసు.. అందుకే నాపై ఆయనకు నమ్మకమని తమన్ అన్నారు. ఇక డైరెక్టర్ గోపీచంద్‌ మలినేనితోనూ నాకు మంచి అనుబంధం ఉందని, ఆయన దర్శకత్వం వహించిన 6 సినిమాల్లో వరుసగా 5 చిత్రాలకు సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉందని తమన్ అన్నారు.

 

ఆ తర్వాతే తదుపరి సినిమాలు..

లాక్‌డౌన్‌లో రికార్డింగ్‌ పనులు చూసుకుంటూ ఉన్నాను. సంగీతం అనేది నాకు అన్నం పెడుతోంది.. కాబట్టి నా దృష్టంతా పూర్తిగా సంగీతంపైనే.. నటించాలనే ఆలోచన ఒక్క శాతం కూడా లేదు. ప్రస్తుతం తెలుగులో ‘సర్కారువారి పాట, వకీల్‌ సాబ్, టక్‌ జగదీష్‌’ తో పాటు పవన్‌ కల్యాణ్‌గారి 29వ సినిమా సంగీత పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాకే తెలుగులో కొత్త సినిమాలు అంగీకరిస్తాను.

Also Read: Aishwarya In HYD: భాగ్యనగరంలో తళుక్కుమన్న మాజీ ప్రపంచ సుందరి.. భర్త, కూతురుతో కలిసి..