దేశంలో కరోనా తర్వాత ముంబై ఇంకో వ్యాధితో తట్టుకోలేకపోతుంది. రోజురోజుకు ఆ వ్యాధి కేసులు పెరుగుతూ, మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. మరి అది ఏం వ్యాధి అంటే..? తట్టు.. అవున తట్టువ్యాధి దాటికి తట్టుకోలేకపోతుంది ముంబై. రోజురోజుకు కేసులు పెరుగిపోతున్నాయి. ఒక్కరోజే మహానగరంలో 20 మంది తట్టు బారినపడ్డారు. తాజాగా ఈ వ్యాధితో ఏడాది వయస్సున్న చిన్నారి ప్రాణం పోయింది. దీంతో ఇప్పటి వరకు ఈ ఏడాదిలో పదకొండు మంది తట్టు వల్ల ప్రాణాలు కోల్పోయారు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 220 కేసులు నమోదయ్యాయి. ఈ మీజిల్స్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు తొమ్మిది నెలల నుంచి ఐదేండ్ల వయస్సు ఉన్న తమ చిన్నారులకు వెంటనే టీకాలు వేయించాలని ముంబై కార్పోరేషన్ చెబుతోంది. కాగా, మీజిల్స్ చికిత్స కోసం అంధేరిలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపింది. ఈ వ్యాధి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఒళ్లంత దద్దుర్లు, తీవ్రమైన జ్వరం దీని లక్షణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. విరేచనాలు, న్యుమోనియా కూడా కొందరిలో ఉంటుంది.. ఇవన్నీ కలగలిసి వ్యాధి ముదిరి మరణానికి కారణమవుతాయి. రోగ నిరోధకత స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇది వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కాగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి మీజిల్స్ సోకుతుంది. ఒళ్లంత దద్దుర్లు, తీవ్రమైన జ్వరం దీని లక్షణాలు. కొందరిలో విరేచనాలు, న్యుమోనియా కూడా ఉంటాయి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే అపాయం. రోగ నిరోధకత స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇది వ్యాపించే అవకాశం ఉంది. కాగా ఈ రోగానికి 1963లోనే వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రపంచవ్యాప్తంగాఏటా లక్షా 40 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.