కరోనాతో ఫేమస్‌ ‘పానీ పూరీ వాలా’ మృతి.. దాతృత్వం చాటుకుంటున్న కస్టమర్లు

| Edited By:

Jun 25, 2020 | 9:30 PM

అనుకోకుండా వచ్చిన కరోనా రక్కసితో ప్రపంచం మొత్తం ఇప్పుడు వణుకుతోంది. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..

కరోనాతో ఫేమస్‌ పానీ పూరీ వాలా మృతి.. దాతృత్వం చాటుకుంటున్న కస్టమర్లు
Follow us on

అనుకోకుండా వచ్చిన కరోనా రక్కసితో ప్రపంచం మొత్తం ఇప్పుడు వణుకుతోంది. ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. చాప కింద నీరులా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఇక ఈ వైరస్ సోకిన చాలా మంది కోలుకుంటున్నప్పటికీ.. కొంతమంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ ముంబయిలోని నేపియన్ సీ రోడ్‌లో పానీ పూరీ అమ్ముకునే ప్రముఖ భగవతి యాదవ్(46) నెల రోజుల క్రితం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు భగవతి కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఓ క్యాంపైన్‌ను ప్రారంభించి, డబ్బులు వసూలు చేస్తున్నారు.

 

 

కాగా ‘బిస్లెరీ పానీ పూరీ వాలా’గా భగవతికి దక్షిణ ముంబయిలో మంచి పేరు ఉంది. బిస్లెరీ నీటితోనే అతడు పానీ పూరీని చేసే వాడని, అందరిని చాలా బాగా చూసుకునే వాడని అక్కడివారు చెబుతున్నారు. ఆయన చేసే పానీ పూరీలు కూడా చాలా రుచిగా ఉండేవని, శుభ్రంగా పానీ పూరీని తయారు చేసేవాడని.. భగవతి దగ్గర తరచుగా కొనుగోలు చేసే కస్టమర్లు చెబుతున్నారు. ఇక ఈ క్యాంపైన్ ప్రారంభించిన రెండు రోజుల్లోనే రెండు లక్షలు వచ్చిందని.. మొత్తం 5లక్షలను లక్ష్యంగా పెట్టుకున్నామని వారు అంటున్నారు. ఇక దీనిపై యశ్ బైద్ అనే ఓ వ్యక్తి మాట్లాడుతూ.. భగవతి ఇంట్లో ఆయన ఒక్కరే డబ్బులను సంపాదించే వ్యక్తి. ఆయన కుటుంబానికి తోచిన సాయం చేయాలనుకున్నాం. దీంతో ఓ వెబ్‌సైట్‌లో క్యాంపైన్‌ ప్రారంభించాం అని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న భగవతి కుమార్తె సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన తండ్రిని గుర్తించుకొని సాయం చేస్తున్న వారికి కృతఙ్ఞతలని భగవతి కుమార్తె చెబుతోంది.

Read This Story Also: బైక్‌లో మంటలు.. శానిటైజర్‌ వల్లేనా..!