కరోనా రూల్స్ పాటించని హాస్పిటల్.. 27 మందికి పాజిటివ్..!
ప్రపంచం మొత్తం కరోనాతో యుద్ధం చేస్తుంటే.. అస్సాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహారిస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే రోగులకు చికిత్స చేస్తూ మరిన్ని కేసులు పెరగడానికి కారణమైంది. స్థానిక మున్సిపల్ అధికారులు జరిపిన దాడులు ఇదే బహిర్గతం అవడంతో వెంటే ఆస్పత్రిని మూసేశారు.

ప్రపంచం మొత్తం కరోనాతో యుద్ధం చేస్తుంటే.. అస్సాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం మాత్రం ఏమి పట్టనట్లు వ్యవహారిస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే రోగులకు చికిత్స చేస్తూ మరిన్ని కేసులు పెరగడానికి కారణమైంది. స్థానిక మున్సిపల్ అధికారులు జరిపిన దాడులు ఇదే బహిర్గతం అవడంతో వెంటే ఆస్పత్రిని మూసేశారు. అస్సాం రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో కోవిడ్ -19 మార్గదర్శకాలను ఉల్లంఘించిన మాంచెస్టర్‌లోని బ్లూ వీల్ హాస్పిటల్‌ని అధికారులు సీజ్ చేశారు. ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఇప్పటిరకు 27 కరోనా కేసులు నమోదైనట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. కోవిడ్ నిబంధనల్ని గాలికొదిలేసి.. వారిని సాధారణ రోగులతో కలిపి చికిత్స అందించినట్లు అధికారులు గుర్తించారు. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషేంట్లకు చికిత్స అందించేందుకు అనుమతినిచ్చింది. దీంతో భువనేశ్వర్ కు చెందిన మాంచెస్టర్‌లోని బ్లూ వీల్ హాస్పిటల్ కూడా ఫర్మిషన్ తీసుకుంది. కానీ, కరోనా బాధితులను కూడా సాధారణ రోగులుగానే భావిస్తూ చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. అంతేకాకుండా పీపీఈ కిట్, ఎన్95 మాస్క్ సహా ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదని అధికారులు గుర్తించారు. సాధారణ రోగులతో సహా వీరిని కూడా ఒకే వార్డులో ఉంచారు. ఆకస్మిక తనఖీలు చేపట్టిన అధికారులు అస్పత్రి దుస్థితి చూసి అవాక్కయ్యారు. ఇక ఆస్పత్రిలో ఉన్న మిగతా వారికి పరీక్షలు నిర్వహించగా 27 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర వైద్యం కోసం వచ్చిన వారికి కరోనాను అంటగట్టిన ఆస్పత్రి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.