
కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెబుదామని ముంబై రెడీ అయితే, బెదిరింపు ఫోన్‌కాల్ పరేషాన్ చేసింది. ముంబై మహానగరంలో వరుస పేలుళ్లు జరుగుతాయని నార్త్ ముంబై పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దీంతో యావత్ పోలీస్ విభాగం అలర్ట్ అయింది. ముంబై వ్యాప్తంగా వాహనాలను తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. న్యూ ఇయర్ వేళ, ప్రజలు భయభ్రాంతులు చెందకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎలాంటి ఛాన్స్ తీసుకోవడం లేదు. అందుకే ఈ కాల్ చేసింది ఎవరని కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో కాల్ వచ్చింది. అందులో ‘ముంబైలో పేలుళ్లు జరుగుతాయి’ అని పేర్కొన్న వ్యక్తి కాల్ కట్ చేశాడు. దీంతో వెంటనే ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు కానీ.. వ్యక్తలు కాని దొరకలేదన్నారు.
బాంబు బెదిరింపు కాల్ పై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ముంబయి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, ఎవరైనా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
#WATCH | Maharashtra CM Eknath Shinde says, “Mumbai Police is alert and fully capable. If anyone does anything illegal, strict action will be taken…” https://t.co/JRWCXn2VWB pic.twitter.com/0JsnDA0uwd
— ANI (@ANI) December 31, 2023
కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని నగర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..