బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరో నోటీసు జారీ చేశారు. ఖర్ ప్రాంతం లోని ఆమె ఇంట్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, ఇందులో పేర్కొన్నారు. పాలీ హిల్ లోని కంగనా ఆఫీసు లోని ఇల్లీగల్ నిర్మాణాల కన్నా ఇంట్లో అధికంగా ఉన్నాయని ఈ నోటీసులో తెలిపారు. కంగనా ఇక్కడ 5 వ ఫ్లోర్ లో ఉంటోంది. ఈ బిల్డింగ్ లో ఈమెకు మరో మూడు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఈ నెల 9 న కంగనా ఆఫీసును ముంబై అధికారులు కూల్చి వేశారు. అయితే బాంబే హైకోర్టు స్టే జారీ చేసేసరికి ఆ పని ముగిసింది.