Mumbai: బ్యాంకు కస్టోడియన్ గా ఉంటూ రూ.12 కోట్ల చోరీ.. వేషాలు మార్చి తిరుగుతూ.. చివరికి..

|

Oct 06, 2022 | 1:32 PM

దొంగ ఎప్పటికైనా దొరక్క మానడు అనే సామెత గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇదే సామెతను గుర్తుకు తెస్తోంది మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఓ దొంగతనం కేసు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.12 కోట్లను కాజేసి పరారయ్యాడు. ఓ ప్రబుద్ధుడు. చోరీ చేసిన..

Mumbai: బ్యాంకు కస్టోడియన్ గా ఉంటూ రూ.12 కోట్ల చోరీ.. వేషాలు మార్చి తిరుగుతూ.. చివరికి..
Police Custody (file Photo)
Follow us on

దొంగ ఎప్పటికైనా దొరక్క మానడు అనే సామెత గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇదే సామెతను గుర్తుకు తెస్తోంది మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఓ దొంగతనం కేసు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.12 కోట్లను కాజేసి పరారయ్యాడు. ఓ ప్రబుద్ధుడు. దొంగతనం చేసిన తర్వాత పోలీసులకు చిక్కకుండా తన తెలివితేటలను ఉపయోగించి తప్పించుకుంటూ వచ్చాడు. చివరికి పోలీసుల ఇంటిలిజెన్స్ ముందు దొరికిపోయాడు నిందితుడు. రెండు చోరీ చేసిన తర్వాత రెండు నెలలకు పైగా ఎవరికి దొరక్కుండా తప్పించుకుంటూ వచ్చాడు. అయితే ఎక్కువ అమౌంట్ కావడంతో పోలీసులు ఈ కేసుపై స్పషల్ ఫోకస్ పెట్టారు. దీంతో పోలీసులకు చిక్కిన నిందితుడు కటకటాలపాలయ్యాడు. థానేలోని మన్‌పాడ ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంకులో కస్టోడియన్ గా ఉంటూ రూ. 12 కోట్ల నగదు కొట్టేసిన వ్యక్తిని కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు అల్తాఫ్ షేక్‌ను పుణెలో అక్టోబర్ 3వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేషాలు మారుస్తూ, తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని చోరీ జరిగిన సుమారు రెండు నెలల 20 రోజుల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిందితుడి నుంచి రూ.9 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుధవారం పోలీసులు మీడియాకు వెల్లడించారు.

థానే , నవీ ముంబై పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో అల్తాఫ్ షేక్‌ను అరెస్టు చేశామన్నారు. బ్యాంకులో చోరీ కోసం ఏడాది క్రితం నుంచే నిందితుడు ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. ముంబైకి చెందిన అల్తాఫ్ షేక్‌ ఐసీఐసీఐ బ్యాంకులో కస్టోడియన్‌గా పని చేసేవాడు. దీనిలో భాగంగా లాకర్ తాళాలకు కేర్‌టేకర్‌గా ఉండేవాడు. ఈ నేపథ్యంలో బ్యాంకులో ఉన్న నగదు చూసి ఎలాగైనా సొమ్మును తస్కరించాలని ఏడాది కాలంగా భారీ ప్లాన్‌ వేశాడు. ఈ క్రమంలో సిస్టంలోని లూప్‌ హోల్స్‌ని గమనించాడు. అలాగే సీసీటీవీ ఫుటేజీని ట్యాంపరింగ్ చేసి, ఏసీ డక్ట్‌ ద్వారా మొత్తం దోపిడీని ప్లాన్ చేశాడు. తనను ఎవరూ గుర్తించకుండా బురఖా వేసుకొని మరీ నగదు దోచేశాడు. ఈ వ్యవహారంలో సహకరించిన అల్తాఫ్ షేక్‌ సోదరి నీలోఫర్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు అబ్రార్ ఖురేషీ, అహ్మద్ ఖాన్, అనుజ్ గిరిను పోలీసులు అరెస్టు చేశారు.

చోరీ చేసే సమయంలో నిందితుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. అలారం సిస్టమ్‌ను డియాక్టివేట్ చేసి, సీసీటీవీని ధ్వంసం చేసిన తర్వాత నిందితుడు బ్యాంక్ ఖజానాను తెరిచి, నగదును కొట్టేసి అక్కడినుంచి పారి పోయాడు. ఈ ఏడాది జూలై 12న ఈ చోరీ జరిగింది. అయితే డీవీఆర్ సెక్యూరిటీ డబ్బు కూడా కనిపించకుండా పోయిందని సిబ్బంది గ్రహించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చోరి చేసిన రూ.12.20 కోట్లలో సుమారు 9 కోట్లను పోలీసులు రికవరీ చేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని, విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..