ఆపదలో ఉన్న వారికి సాయం అందిస్తూ… గొప్ప మానవతావాది అనిపించుకుంటున్నబాలీవుడ్ నటుడు సోనుసూద్ ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన ఓ హోటల్ కేసు విషయంలో ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.
గతేడాది అక్టోబర్‌లో ముంబైలోని సబర్బన్ జుహులోని ఓ నివాస భవనాన్నిసోనూసూద్ హోటల్‌గా మార్చాడు. అయితే దీనిపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నోటీసులు జారీ చేసింది. బీఎంసీ జారీ చేసిన నోటీసును కోర్టు రద్దు చేసి, తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో సోనుసూద్ కోరారు. కాగా, బీఎంసీ జారీ చేసిన నోటీస్‌ను సవాల్ చేస్తూ బాలీవుడ్ నటుడు సోనుసూద్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం బాంబే హైకోర్టు కొట్టివేసింది.
గతేడాది బీఎంసీ నోటీసు అందుకున్న సోనూసూద్ సివిల్ కోర్టును ఆశ్రయించినా.. ఉపశమనం దొరకలేదు. అనంతరం హైకోర్టులో అప్పీల్ చేశాడు. అనుమతి లేకుండా నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారనే ఆరోణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బీఎంసీ ఈ నెలలో జుహు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్టోబర్‌లో బీఎంసీ భవనాన్ని పరిశీలించి.. నిబంధనలు పాటించలేదని, అనధికారికంగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నట్లు పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది.