మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జబల్‌పూర్-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతిచెందారు. రెండు లారీలు బియ్యం, బత్తాయిల లోడ్‌తో వెళ్తున్నాయి. అయితే రెండు లారీలు ఎదురెదురుగా ఢి కొట్టిన వెంటనే మంటలు చెలరేగాయి. ఈ క్రమంలోనే లారీల డ్రైవర్లు ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసు అధికారి తెలిపారు.
Madhya Pradesh: Two trucks collided head-on & caught fire on Jabalpur-Nagpur Highway in Chhapara area of Seoni district yesterday. Chhapara police station in-charge Nilesh Parteti said, “Two people charred to death, four others rushed to a hospital.” pic.twitter.com/6ySfAJueWC
— ANI (@ANI) August 13, 2020
Read More :