Gen Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదంపై ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

|

Dec 09, 2021 | 11:08 AM

Defence Chief General Bipin Rawat Dies In Chopper Crash: సిడిఎస్ బిపిన్ రావత్ మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gen Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదంపై ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు
Helicopter Crash
Follow us on

Gen Bipin Rawat Chopper Crash: సిడిఎస్ బిపిన్ రావత్ మృతికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేసిన ఆయన.. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన షాకింగ్..  దేశ భద్రతకు పెద్ద హెచ్చరికగా  ఆయన అభివర్ణించారు. తమిళనాడులోని ఊటీకి సమీపంలో బుధవారంనాడు ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందడం తెలిసిందే. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

దుర్ఘటనపై ఫైనల్ రిపోర్ట్ రానందున.. తాను దీనిపై మాట్లాడటం చాలా కష్టమన్నారు. అయితే తమిళనాడు లాంటి సేఫ్ జోన్‌లో మిలటరీ హెలికాప్టర్ పేలిన విషయం సాధారణ అంశం కాదని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు.  ఈ వ్యవహారంలో తీవ్రమైన దర్యాప్తు అవసరమన్నారు.  ప్రజల్లో నెలకొన్న అనుమానాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఈ ఘటనపై విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలని సుబ్రహ్మణ్య స్వామి కోరారు.

ఈ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఇప్పటికే భారత వైమానిక దళం (IAF) విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా బిపిన్ రావత్, ఆయన సతీమణి భౌతికకాయాలను ఇవాళ (గురువారం) ఢిల్లీకి తరలించనున్నారు. శుక్రవారంనాడు వారి భౌతిక కాయాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Also Read…

Helicopter Crash Video: ప్రమాదానికి కొన్ని సెకెన్ల ముందు.. వీడియో రికార్డ్ చేసిన టూరిస్టులు..

Black Box: దొరికిన బ్లాక్ బాక్స్.. ఏం జరిగింది..? ఏముంది..? పైలట్‌ బిపిన్‌ రావత్‌తో ఏం మాట్లాడారు..