
MP policeman seeks leave saying ‘wife has threatened me’, application goes viral ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పై అధికారులకు సెలవుల కోసం ఓ లెటర్ రాశాడు. అందులో 5 రోజులు సెలవులు కావాలని కోరాడు. అయితే ఆ లెటర్‌లో అతడు చూపిన కారణం, ఆ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ కానిస్టేబుల్ ఎవరు, ఆ లెటర్‌లో ఏం ఉందో చూద్దామా…
మధ్యప్రదేశ్‌లోని భూపాల్ కు చెందిన దిలీప్ కుమార్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు ఇటీవల పై అధికారులకు లీవ్ కోసం లెటర్ రాశాడు. ఇప్పుడు ఆ లెటర్ పెద్ద చర్చకు దారి తీయడంతో పాటు అతడిపై చర్యలకు దిగేలా చేస్తున్నాయి…
దిలీప్ కుమార్ తనకు ఐదు రోజులు సెలవు కావాలని పై అధికారులను కోరారు. తన బావమరిది పెళ్లి ఉందని తెలిపాడు. ఒకవేళ పెళ్లికి తాను హాజరు కాకపోతే పరిస్థితులు దారుణంగా మారుతాయని తనని తన భార్య బెదిరించిందని ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే పై అధికారులు లీవ్ ఇవ్వకపోగా… లెటర్‌లో రాసిన విధానం సరిగ్గా లేదని అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో కానిస్టేబుల్ దిలీప్ పరిస్థితి దయనీయంగా మారింది.