Cobra: ఇంట్లోనే తిష్ట వేసిన కోబ్రా, 26 పిల్లలు.. చూసి హడలిపోయిన కుటుంబసభ్యులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Cobra and 26 hatchlings rescued: అటవీ ప్రాంతాల్లో అన్ని రకాల జీవులు స్వేచ్ఛగా నివసిస్తుంటాయి. క్రూర మ‌ృగల నుంచి విష సర్ఫాల వరకూ అన్ని తమ తమ నివాస స్థావరాలను

Cobra: ఇంట్లోనే తిష్ట వేసిన కోబ్రా, 26 పిల్లలు.. చూసి హడలిపోయిన కుటుంబసభ్యులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Cobra And 26 Hatchlings Rescued

Edited By:

Updated on: Jul 11, 2021 | 7:20 PM

Cobra and 26 hatchlings rescued: అటవీ ప్రాంతాల్లో అన్ని రకాల జీవులు స్వేచ్ఛగా నివసిస్తుంటాయి. క్రూర మ‌ృగల నుంచి విష సర్ఫాల వరకూ అన్ని తమ తమ నివాస స్థావరాలను ఏర్పరుచుకుంటాయి. ఇలాంటి సందర్భంలోనే.. ఎక్కడి నుంచి వ‌చ్చిందో.. ఎలా వ‌చ్చిందోగానీ ఓ ఇంట్లో ఓ నాగుపాము స్వేచ్ఛగా నివాస స్థావరాన్ని ఏర్పరుచుకుంది. ఆ ఇంట్లోనే గుడ్లు పెట్టి పిల్లలను కూడా చేసింది. అది ఒకటి రెండు కాదు.. ఏకంగా 26 పిల్లలను చేసింది. అయినా కానీ ఆ ఇంట్లో వారికి పాము కంట‌ప‌డ‌లేదు. ఎవ‌రికీ ఎలాంటి హాని కూడా తలపెట్టలేదు.

ఇన్నాళ్లూ గుట్టుచ‌ప్పుడు కాకుండా ఉన్న పాము శుక్రవారం.. ఆ ఇంటి య‌జ‌మాని కంట‌ ప‌డింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులందరూ భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత అట‌వీ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఈ షాకింగ్ సంఘటన ఒడిశా రాష్ట్రం క‌ల‌హండి జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇంటి య‌జ‌మాని ఫిర్యాదు తర్వాత అక్కడకు చేరుకున్న అట‌వీ సిబ్బంది ఆ తాచు పామును బంధించారు. ఆ పాముతోపాటు మొత్తం 26 పిల్లలు కూడా ఉన్నట్లు గుర్తించి అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు.

అనంత‌రం త‌ల్లి పాముతోపాటు 26 పిల్లలను పట్టుకొని ఓ సంచిలో బంధించారు. ఆ తర్వాత స‌మీప అట‌వీ ప్రాంతంలో వ‌దిలేసినట్లు కలహండి అటవీ శాఖ స్నేక్ క్యాచర్ బీరేంద్ర కుమార్ సాహు వెల్లడించారు. పాము ఎవరికి హాని తలపెట్టలేదని అధికారులు వెల్లడించారు.

Also Read:

Visakha Agency: ప్రకృతి సోయగాలతో పులకిస్తున్న విశాఖ మన్యం.. కొండలపై పాల సముద్రాన్ని తలపించేలా.. Watch Video

Harbhajan Singh: రెండోసారి తండ్రైన హర్భజన్ సింగ్.. మా కుటుంబం పరిపూర్ణమైంది అంటూ ట్వీట్

Viral Video: వామ్మో.. వెళ్తున్న కారుపై మెరుపు దాడి చేసిన పైథాన్.. ప్రయాణికులకు ఊహించని షాక్.. వైరల్ వీడియో

Follow Us